ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medak: రాష్ట్రంలో 5 క్యాన్సర్‌ చికిత్స కేంద్రాల ఏర్పాటు

ABN, Publish Date - Oct 25 , 2024 | 03:42 AM

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఐదు చోట్ల చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

  • షుగర్‌, బీపీ, క్యాన్సర్‌ నియంత్రణకు పాలసీ: దామోదర

  • వైద్య విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలి: కొండా సురేఖ

మెదక్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఐదు చోట్ల చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం మెదక్‌లో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీపీ, షుగర్‌, హార్ట్‌, కాన్సర్‌ వ్యాధిగ్రస్తులు నానాటికీ పెరుగుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయని, వీటి నియంత్రణకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నట్లు వివరించారు.


హైదరాబాద్‌లోని ఎంఎంజే ఆస్పత్రిని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల వెంట 74 ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. మంత్రి కొండాసురేఖ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని అలవర్చుకోవాలని, చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెందొద్దని సూచించారు.

Updated Date - Oct 25 , 2024 | 03:42 AM