Education: ప్రతి పేద విద్యార్థికీ కార్పొరేట్ స్థాయి విద్య: భట్టి
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:33 AM
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికీ కార్పొరేట్ స్థాయిలో అత్యున్నత విద్యను అందించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికీ కార్పొరేట్ స్థాయిలో అత్యున్నత విద్యను అందించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సమీకృత గురుకులాలను, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. బుధవారం సచివాలయంలో గురుకులాలు, స్కిల్ యూనివర్సిటీ భవన నమూనాలను పరిశీలించారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక సమీకృత గురుకుల పాఠశాలను నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ భవనాలకు సంబంధించి స్థలాల సేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఆయన అధికారులను ఆరా తీశారు. ఈ గురుకులాల ద్వారా రాష్ట్రంలోని దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకి చెందిన ప్రతి పేద విద్యార్థికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తామన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 03:33 AM