Hyderabad: మత్స్యశాఖకు ఇన్‌లాండ్ స్టేట్ అవార్డు
ABN, Publish Date - Nov 23 , 2024 | 05:04 AM
చేపల పెంపకంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను తెలంగాణ రాష్ట్రానికి 2024 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ పురస్కారం(బెస్ట్ ఇన్‌లాండ్ ఫిషరీస్ స్టేట్) లభించింది.
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): చేపల పెంపకంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను తెలంగాణ రాష్ట్రానికి 2024 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ పురస్కారం(బెస్ట్ ఇన్‌లాండ్ ఫిషరీస్ స్టేట్) లభించింది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నవంబరు 21న కేంద్ర పశుసంవర్థక, మత్స్యశాఖమంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక ఆల ఢిల్లీలో దీనిని అందుకున్నారు. ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం మత్స్యశాఖ ఉన్నతాధికారులు అందించారు.
ఈ ఏడాదిలో మత్స్యశాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే పురస్కారం దక్కిందని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 5,901 మత్స్య సహకార సంఘాలు, 4,13,120 మంది సభ్యులు ఉన్నారని, 2023 డిసెంబరు నుంచి 225 కొత్త సంఘాలు ఏర్పాటుచేసి, 8,069 మంది కొత్త సభ్యులను చేర్చి బలోపేతం చేసినట్లు సభ్యసాచి ఘోష్ వివరించారు. ఈ ఏడాది 4.56 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో రూ. 7,059 కోట్ల ఆదాయాన్ని గడించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యశాఖ కీలక పాత్ర పోషించినట్లు ఘోష్ వివరించారు.
Updated Date - Nov 23 , 2024 | 05:04 AM