Share News

Bhatti Vikramarka: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:51 AM

తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్‌ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ అమెరికాలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Bhatti Vikramarka: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి

  • ‘మైనెక్స్‌-24’లో అమెరికన్‌ కంపెనీలకు భట్టి పిలుపు

హైదరాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్‌ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ అమెరికాలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్‌వేగా్‌సలో మంగళవారం ప్రారంభమైన అంతర్జాతీయ ‘మైనెక్స్‌- 2024’(మైన్‌ ఎక్స్‌పో)లో పలు అమెరికన్‌ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, వ్యాపారాలకు హైదరాబాద్‌ అత్యంత అనువైన ప్రాంతమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోందని వారికి వివరించారు.


అమెరికా ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్‌ మార్కెట్స్‌ సంస్థ సహాయ కార్యదర్శి అరుణ్‌ వెంకటరామన్‌ మాట్లాడుతూ ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలు హైదరాబాద్‌లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాయని, ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని సంస్థలు ముందుకు రావచ్చని పేర్కొన్నారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ అంతర్జాతీయ ‘మైనెక్స్‌- 2024’లో ప్రపంచంలోని సుమారు 1,900 యంత్రఉత్పత్తి సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. 121 దేశాల నుంచి 44వేల మంది ప్రతినిధులు అందులో పాల్గొంటున్నారు.

Updated Date - Sep 26 , 2024 | 03:52 AM