Maoist Movement: దండకారణ్యంలో తెలుగు ‘వార్’!
ABN, Publish Date - Oct 09 , 2024 | 03:59 AM
మావోయిస్టు ఉద్యమాన్ని తెలుగు వారే నడిపిస్తే. అదే మావోయిస్టు పార్టీని దెబ్బకొట్టడంలోనూ తెలుగు పోలీసు అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు.
నక్సల్స్ ఉద్యమంలో తెలుగోళ్ల కీలక పాత్ర.. వివిధ రాష్ట్రాల్లో పార్టీని నడిపిస్తున్న నేతలు
నేడు ఆపరేషన్ ‘కగార్’లో తెలుగు పోలీసులు
భారీ ఎన్‌కౌంటర్లలో వారిదే కీలక పాత్ర
ఈ ఏడాది ఇప్పటి వరకు 200 మంది నక్సల్స్ మృతి
నేతల మరణంతో ఉద్యమంపై నీలినీడలు
చర్ల, అక్టోబరు 8: మావోయిస్టు ఉద్యమాన్ని తెలుగు వారే నడిపిసే,్త అదే మావోయిస్టు పార్టీని దెబ్బకొట్టడంలోనూ తెలుగు పోలీసు అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 1967లో ప్రారంభమైన నక్సల్స్ ఉద్యమ ప్రస్థానం 11 రాష్ట్రాల మీదుగా దండకారణ్యానికి చేరుకోగా, ప్రస్తుతం ఆపరేషన్ కగార్‌తో కేంద్రబలగాలు మావోయిస్టులను ఎన్‌కౌంటర్లు చేస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలోనూ తెలుగు పోలీసు అధికారులే కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇలా వరుస ఎన్‌కౌంటర్లతో పార్టీ కుదేలవడంతో ఉద్యమంపై నీలి నీడలు అలుముకున్నాయి. ఈతరుణంలో మావోయిస్టు ఉద్యమం అంత్య దశకు చేరుకుందా? వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కుదేలైందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
నక్సల్స్ బరి ఉద్యమం
నక్సల్స్‌బరిలో ప్రారంభమైన ఉద్యమం 2004లో మావోయిస్టు పార్టీగా మారింది. 1967 నుంచి 1980వరకు అటు ఉద్యమాన్ని నడిపించిన వారిలో తెలుగు వారే ఉన్నారు. అభూజ్‌మడ్ కేంద్రంగా 2004 లో మావోయిస్టు పార్టీగా మారిన తరువాత కూడా తెలుగువారే పార్టీని నడిపించారు. అటు ఛత్తీ్‌సగఢ్, ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్ర, దండకారణ్యం ఇలా అనేక చోట్ల పార్టీకి నాయకత్వం వహించారు. గతంలో మావోయిస్టు పార్టీ ఇండియా కార్యదర్శిగా గణపతి పని చేశారు. ఆయన తెలుగు వారే కావడం, పార్టీ నుంచి ఆయన బయటికి వచ్చిన తరువాత శ్రీకాకుళానికి చెందిన నంబాల కేశవరావు ఆ బాధ్యతలు చేపట్టడం విశేషం. అలాగే కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్లలోనూ తెలుగు వారు వివిధ రాష్ట్ర్టాల్లో మావోయిస్టు పార్టీలో కీలక సభ్యులుగా పనిచేసి పార్టీని నడిపించిన అక్కిరాజు హరగోపాల్, హరిభూషణ్ శంకరావు, సాగర్, ఏసేబ్ మృతి చెందారు. వీరితో పాటు అనేక మంది తెలుగు వారు మావోయిస్టు పార్టీని నడిపించారు.
భారీ ఎన్‌కౌంటర్లలో..
గత ఏప్రిల్ 17న జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన అధికారి తెలుగు అధికారే కావడం విశేషం. అలాగే గత ఐదు రోజుల క్రితం ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలోనూ తెలుగు అధికారే కీలక పాత్ర పోషిచారు. ఈ రెండు ఎన్‌కౌంటర్లు దేశ చరిత్రలో అతిపెద్ద ఘటనలుగా నిలిచాయి. జనవరి నుంచి భారీ ఎన్‌కౌంటర్లలో సుమారు 200 మంది మావోయిస్టులు మృతి చెందారు. 500మందికి పైగా లొంగిపోయారు. 350 మందికి పైగా అరెస్టయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల మృతి
దుమ్ముగూడెం అక్టోబరు 8: భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీ్‌సస్టేషన్ పరిధిలో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య పామలూరు గుట్టల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. మృతి చెందిన మావోయిస్టును కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు లోకే్‌షగా పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, 206, 208 కోబ్రా, 131బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఎన్‌కౌంటర్ తరువాత పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
Updated Date - Oct 09 , 2024 | 08:49 AM