ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cold Wave: వణుకు మొదలైంది

ABN, Publish Date - Nov 18 , 2024 | 02:52 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవటంతో చలి తీవ్రత మొదలైంది. శీతాకాలం ప్రారంభమైనా ఇన్నాళ్లు చలి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.

  • రాష్ట్రవ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  • ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 11.8 డిగ్రీలు

  • రాబోయే 3 రోజుల్లో మరింత తగ్గే అవకాశం

  • చలి తీవ్రతపై అన్ని జిల్లాలకు యెల్లో అలెర్ట్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, నవంబరు 17: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవటంతో చలి తీవ్రత మొదలైంది. శీతాకాలం ప్రారంభమైనా ఇన్నాళ్లు చలి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. కానీ గత రెండు రోజులుగా రాత్రివేళల్లో చలిగాలుల ప్రభావం పెరగడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అటవీ ప్రాంతాలు ఉన్న మండలాల్లో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఆయా చోట్ల ఉదయం 6 గంటలకు కూడా ప్రధాన రహదారులను పొగమంచు కప్పెస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


అదే జిల్లాలోని సిర్పూర్‌లో 12.3, వాంకిడి, కెరమెరి ప్రాంతాల్లో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఆదిలాబాద్‌లో 13.2, మెదక్‌లో 14.2, రామగుండంలో 16.4, హన్మకొండలో 17.3, భద్రాచలంలో 17.9, డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడంలో 14.4, వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 14.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులోని పటాన్‌చెరులో అత్యల్పంగా 15.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్‌ అయింది. కాగా, నల్లగొండ జిల్లాలో చలి తీవ్రత అంతగా కనిపించకపోవడం విశేషం. మరోవైపు రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీల మేరకు, రాత్రివేళ సైతం అంతేస్థాయిలో తగ్గుతాయని తెలిపింది.


ప్రస్తుతం రాష్ట్రంలో పగటిపూట సగటు 35-39 డిగ్రీల మధ్య నమోదు అవుతుండగా... రాత్రివేళ 15-19 మధ్య రికార్డ్‌ అవుతున్నాయి. అయితే రాగల మూడు రోజులు రాత్రివేళ ఉష్ణోగ్రతలు 11-14 డిగ్రీల ఽమధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు చలికి సంబంధించిన యెల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సాధారణంగా 10-15 మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే యెల్లో అలెర్ట్‌, అంతకు మించి తగ్గితే ఆరెంజ్‌, ఇంకా తగ్గితే అంటే 0-5 డిగ్రీల మధ్యకు పడిపోతే రెడ్‌ అలెర్ట్‌ జారీ చేస్తారు. రాబోయే మూడు రోజులకు వాతావరణ కేంద్రం అన్ని జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని పేర్కొంది. రాత్రివేళ 12.30 నుంచి ఉదయం 5.30 గంటల మధ్య ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 02:52 AM