ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Renewable Energy: హరిత ఇంధనం @ 50 వేల మెగావాట్లు

ABN, Publish Date - Nov 17 , 2024 | 03:31 AM

రాష్ట్రంలో హరిత ఇంధన ఉత్పాదక సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 10,095 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యాన్ని రాబోయే పదేళ్లలో 50,500 మెగావాట్లకు పెంచాలని యోచిస్తోంది.

  • ప్రస్తుతం 10 వేల మెగావాట్లు..

  • పదేళ్లలో భారీగా పెంచాలని లక్ష్యం

  • సౌర, పవన విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలు

  • సీలింగ్‌ వర్తించదు.. నాలా అక్కర్లే

  • ప్లాంట్‌ పెట్టగానే పరిశ్రమ హోదా

  • యంత్రాలు, పరికరాలకు 100%

  • రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు తెలంగాణ పునరుత్పాదక ఇంధన

  • విధానం సిద్ధం చేసిన సర్కారు త్వరలోనే అధికారికంగా వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హరిత ఇంధన ఉత్పాదక సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 10,095 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యాన్ని రాబోయే పదేళ్లలో 50,500 మెగావాట్లకు పెంచాలని యోచిస్తోంది. 2034-35 నాటికి కొత్తగా 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా మొత్తం 50,500 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ (బ్యాటరీ+పంప్డ్‌ స్టోరేజీ) ప్రాజెక్టులు, జియోథర్మల్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించడానికి వీలుగా ‘తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం- 2024’ని సిద్ధం చేసింది. త్వరలో దీన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ విధానాన్ని ప్రకటించగానే విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లు టారిఫ్‌ ఆధారిత పోటీ బిడ్డింగ్‌ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు, పవన విద్యుత్కేంద్రాల స్థాపనకు బిడ్లను ఆహ్వానించనున్నాయి.


ఈ విద్యుత్కేంద్రాల స్థాపనకు భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నారు. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇస్తారు. ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇవ్వనున్నారు. బిడ్డర్‌కు మార్కెట్‌ రేటులో 10ు లీజు ధరతో ప్రభుత్వం భూముల్ని కేటాయించనుంది. అనంతరం రెండేళ్లకోసారి లీజు ధరను 5ు పెంచనుంది. అయితే, ప్రాజెక్టు పూర్తయి, ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే జిల్లా కలెక్టర్‌తో లీజు ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పంద(పీపీఏ) కాలానికే లీజు ఒప్పందమూ ఉండనుంది. టీజీఐపాస్‌ ద్వారా డెవలపర్లకు అన్నిరకాల అనుమతులు వేగంగా జారీ కానున్నాయి. తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(రెడ్కో) నోడల్‌ ఏజెన్సీగా ఉండనుంది. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు బహిరంగ వి పణి ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సొంత అవసరాలకూ సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.


  • ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులు..

నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో టారిఫ్‌ ఆధారిత పోటీ బిడ్డింగ్‌ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ విధానం కింద ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వీటితో వచ్చే విద్యుత్తును డిస్కమ్‌లు కొనుగోలు చేస్తాయి. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్‌ విధానంలో కేటాయించనున్నారు. ఇందుకు గాను నీటిపారుదల శాఖకు డిస్కమ్‌లు విద్యుత్తులో వాటా/నామమాత్రపు అద్దెను చెల్లిస్తాయి. ఇప్పటికే లోయర్‌ మానేరు, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లలో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు పెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.


  • స్వయం సహాయక సంఘాలతో ప్లాంట్లు

రాష్ట్రంలోని సబ్‌స్టేషన్ల వారీగా ఎంత సామర్థ్యంతో సౌర విద్యుత్తు ప్లాంట్ల స్థాపనకు అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కమ్‌లు ప్రకటన చేయనున్నాయి. ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. 500కిలోవాట్‌ నుంచి 2మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల స్థాపనకు అవకాశం ఇచ్చి, వారి నుంచి యూనిట్‌ రూ.3.13లకు విద్యుత్తును కొనుగోలు చేస్తాయి.


  • పంప్డ్‌ స్టోరేజీకి రూపాయికే హెక్టారు భూమి!

పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను 45 ఏళ్లకు నామమాత్రపు లీజుతో ఇవ్వనుంది. ప్రైవేటు స్థలాలు అవసరమైతే నోడల్‌ ఏజెన్సీ అయిన రెడ్కో.. వాటిని సేకరించి వార్షిక లీజు ధరతో డెవలపర్లకు కేటాయించనుంది. పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల స్థాపనకు ప్రైవేటు డెవలపర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థలను నామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. టెండర్లు దక్కించుకున్న ఆరేళ్లలోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. సౌర విద్యుత్తు ప్లాంట్లను రెండేళ్లలో, పవన విద్యుత్తు ప్లాంట్లను మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

పునరుత్పాదక విద్యుత్తు ప్రస్తుత సామర్థ్యం 2034-35 నాటికి లక్ష్యం

(నిర్మాణంలోనివీ కలిపి) (మెగావాట్లలో)

సౌర విద్యుత్తు 7900 26,000

డిస్ట్రిబ్యూటుడ్‌ రెన్యూవల్‌ ఎనర్జీ 467 8000

పవన విద్యుత్తు 128 4500

ఎనర్జీ స్టోరేజీ(పం్‌ప్డ+బ్యాటరీ) 1600 10000

జియో థర్మల్‌ 20 కిలోవాట్లు 2000 మెగావాట్లు

మొత్తం 10,095.20 50,500


  • భారీ ప్రోత్సాహాకాలు..

  • సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, ఇతర పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. భూ వినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు.

  • తెలంగాణ ఐపాస్‌ ద్వారా అన్ని రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తారు.

  • పారిశ్రామిక హోదా కల్పించి రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలను వర్తింపజేస్తారు.

  • ప్రత్యేక ఇన్సెంటివ్‌లు

  • సూపర్‌వైజేషన్‌ చార్జీల నుంచి మినహాయింపు.

  • ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే యంత్రాలు, పరికరాలకు చెల్లించే రాష్ట్ర జీఎస్టీ వాటాను 100శాతం రీ యింబర్స్‌మెంట్‌(తిరిగి) చేస్తారు.

  • వ్యవసాయ సీలింగ్‌ చట్టం నుంచి భూములకు మినహాయింపు ఉంటుంది. సోలార్‌ ఒక మెగావాట్‌ ప్రాజెక్టుకు 4 ఎకరాల వరకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.

  • కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు లోకల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ ఫండ్‌తో పాటు ఇతర గ్రాంట్లు అందనున్నాయి.

  • సర్కారీ భవనాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌..

  • ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్తు ప్లాంట్ల స్థాపనను ప్రోత్సహించనున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 03:31 AM