ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సభ అజెండాను ఇప్పుడే నిర్ణయించండి

ABN, Publish Date - Dec 17 , 2024 | 03:27 AM

శాసనసభ శీతాకాల సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి? ఏయే అంశాలను చర్చకు తీసుకోవాలి? అన్నదానిపై నిర్ణయాధికారాన్ని శాసనసభ ‘సభా సలహా సంఘం (బీఏసీ)’ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు వదిలేసింది.

బీఏసీ సమావేశంలో బీఆర్‌ఎస్‌ డిమాండ్‌.. సభ్యులు సలహాలు ఇస్తారు.. స్పీకర్‌ అజెండాను నిర్ణయిస్తారు

  • సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

  • నిర్ణయాధికారం స్పీకర్‌దేనన్న బీఏసీ

  • సమావేశం నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

  • భేటీ మధ్యలోనే వెళ్లిపోయిన అక్బరుద్దీన్‌

  • శుక్రవారం వరకూ సభ జరిగే అవకాశం!

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): శాసనసభ శీతాకాల సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి? ఏయే అంశాలను చర్చకు తీసుకోవాలి? అన్నదానిపై నిర్ణయాధికారాన్ని శాసనసభ ‘సభా సలహా సంఘం (బీఏసీ)’ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు వదిలేసింది. శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణ అజెండాను ఖరారు చేసేందుకు సోమవారం స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ శాసనసభాపక్ష ఉప నేత పాయల్‌ శంకర్‌, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో చర్చకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, బీజేపీ, సీపీఐ సభ్యులు ఆయా పార్టీల తరఫున అంశాలను ప్రతిపాదించారు. సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని హరీశ్‌రావు ప్రతిపాదించగా.. 30 రోజుల పాటు జరపాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. రోజూ జీరో అవర్‌ను చేపట్టాలని కూడా బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రతిపాదించారు.


అయితే ఆయా పార్టీలు ప్రతిపాదించిన అంశాలను స్పీకర్‌ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సభ ఎన్నిరోజులు నిర్వహించాలన్నదానితో పాటు చర్చించాల్సిన అంశాలపైనా సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని హరీశ్‌ పట్టుబట్టారు. హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానుండడం, క్రిస్మస్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని శ్రీధర్‌బాబు చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సభను ఎన్ని రోజులు నిర్వహించారని నిలదీశారు. ఈ క్రమంలో సుదీర్ఘంగా సమావేశం జరుగుతుండడం, అజెండా ఖరారవకపోవడంపై అసహనం చెందిన అక్బరుద్దీన్‌ ఒవైసీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీఏసీలో సభ్యులు సలహా ఇవ్వాలని, నిర్ణయం స్పీకర్‌ తీసుకుంటారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో లగచర్ల అంశంపై సభలో చర్చ చేపట్టాలని, ఇతర అంశాలపైనా అజెండాను ఖరారు చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు.


అదానీ టీ షర్టులతో రాహుల్‌గాంధీ పార్లమెంటుకు వెళ్లారని, ఇక్కడ మాత్రం బీఆర్‌ఎస్‌ సభ్యులు అదానీ బొమ్మ ఉన్న టీ షర్టును వేసుకుని వస్తే సభలోకి అనుమతించలేదని హరీశ్‌ బీఏసీ దృష్టికి తెచ్చారు. సభ నిబంధనల ప్రకారం ప్లకార్డులు ప్రదర్శించడం, అదానీ బొమ్మ ఉన్న టీ షర్టులతో సభలోకి రావడం నిషిద్ధమని, అందుకే అనుమతించలేదని కాంగ్రెస్‌ సభ్యులు చెప్పారు. బీఏసీ జరగకుండానే సభలో రెండు బిల్లులు ఎలా ప్రతిపాదిస్తారని హరీశ్‌ ప్రశ్నించారు. అలాగే సభ జరుగుతున్న సమయంలో భూమి లేని వారికి రూ.12 వేల సాయం పథకాన్ని భట్టివిక్రమార్క ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. సభలో 9 అంశాలను చర్చకు ప్రతిపాదించిన హరీశ్‌.. లగచర్ల అంశంపై మంగళవారం చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అజెండాను స్పీకరే ఖరారు చేస్తారని శ్రీధర్‌బాబు స్పష్టం చేయడంతో నిరసనగా బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపైనా చర్చకు రాగా.. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. శాసనసభ సమావేశాలు శుక్రవారం వరకూ జరిగే అవకాశం ఉన్నట్లు అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.


అది స్పీకర్‌ నిర్ణయిస్తారు: భట్టి

అసెంబ్లీ నిబంధనల మేరకే బీఏసీ సమావేశం జరిగిందని, బీఆర్‌ఎస్‌ సభ్యులు వ్యవహరించిన తీరు సరిగా లేదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలన్నది స్పీకర్‌ నిర్ణయిస్తారు. పదేళ్లు పాలించిన వారికి అది కూడా తెలియదా? హరీశ్‌రావు చెప్పినట్లు సభ పనిదినాలు ఉండాలంటే ఎట్లా? గత ప్రభుత్వం ఏం చేసిందన్నది నాకు తెలియదా? ఇప్పుడు కూడా అప్పటిలాగే సభ ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకరే నిర్ణయిస్తారు’’ అని చెప్పారు. శాసనసభను ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నదీ స్పీకర్‌ మంగళవారం సభలో ప్రకటిస్తారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వారం పాటు సభ జరిగే అవకాశం ఉందన్నారు.


బీఏసీ అంటే.. బిస్కెట్‌ చాయ్‌ భేటీ కాదు: హరీశ్‌

సభను ఎన్ని రోజులు నడుపుతామన్నది స్పష్టం చేయకపోవడంతో బీఏసీ సమావేశం నుంచి తాము వాకౌట్‌ చేశామని హరీశ్‌ చెప్పారు. కనీసం 15 రోజులు సభను నడపాలని కోరామన్నారు. ఏయే అంశాలపై చర్చ చేపడతారన్నదీ తేల్చలేదని, దీంతో ఇది చాయ్‌, బిస్కెట్‌ సమావేశం కాదంటూ బయటికి వచ్చేశామని మీడియాతో చెప్పారు. ఒకరోజు ప్రభుత్వం ప్రతిపాదించిన అంశంపై, మరో రోజు విపక్షం సూచించిన అంశంపై చర్చించడం సంప్రదాయమని, ఇందులో భాగంగా మంగళవారం లగచర్ల అంశంపై చర్చ చేపట్టాలని కోరినట్లు తెలిపారు.

Updated Date - Dec 17 , 2024 | 03:27 AM