ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG : ఒక్కరే... ఐదు సాధించారు

ABN, Publish Date - Aug 07 , 2024 | 03:47 AM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టసాధ్యమైన రోజుల్లో పలువురు అభ్యర్థులు నాలుగు, ఐదు ఉద్యోగాలకు ఎంపికై స్పూర్తిదాయకంగా నిలిచారు. ఖమ్మం నగరానికి చెందిన గడ్డం సింధూర, వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఎం.డీ సమీయుద్దీన్‌లు ఈ ఘనత సాధించారు.

  • 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన

  • ఖమ్మం యువతి, వికారాబాద్‌ యువకుడు

  • 4 ఉద్యోగాలు సాధించిన జనగామ వాసీ

ఖమ్మం ఖానాపురంహవేలి, జనగామ కల్చరల్‌, మోమిన్‌పేట్‌, ఆగస్టు 6: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టసాధ్యమైన రోజుల్లో పలువురు అభ్యర్థులు నాలుగు, ఐదు ఉద్యోగాలకు ఎంపికై స్పూర్తిదాయకంగా నిలిచారు. ఖమ్మం నగరానికి చెందిన గడ్డం సింధూర, వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఎం.డీ సమీయుద్దీన్‌లు ఈ ఘనత సాధించారు. వీరు ఆర్‌అండ్‌బీ శాఖలో రెండు, పాల్‌టెక్నిక్‌ అధ్యాపకులుగా, గ్రూపు-4 లో కలిపి ఐదు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఇందులో సింధూర.. ఇటీవల విడుదలైన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు సిద్దమవుతోంది. సింధూర తండ్రి ఆదినారాయణ ప్రధానోపాధ్యాయుడు. ప్రస్తుతానికి ఏఈఈగా విధుల్లో చేరి భవిష్యత్తులో ఐఏఎస్‌ లక్ష్యంగా ముందుకెళ్తానని సింధూర తెలిపింది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం టేకులపల్లిలో సాధారణ కుటుంబంలో జన్మించిన సమీయుద్దీన్‌... ప్రభుత్వ బడిలో విద్యాభ్యాసం పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.

రైతు అయిన కరీముద్దీన్‌కు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూనే పరీక్షలకు సన్నద్ధమయ్యాడు.కాగా, జనగామకు చెందిన బర్ల సాయిరాం 4 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ తల్లిదండ్రులైన గణేశ్‌- ఉపేంద్ర ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందన్నాడు.

Updated Date - Aug 07 , 2024 | 03:54 AM

Advertising
Advertising
<