Damodara: టీచర్లకు హెల్త్ కార్డులపై త్వరలో కమిటీ: మంత్రి దామోదర
ABN, Publish Date - Sep 14 , 2024 | 03:00 AM
‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
జోగిపేట, సెప్టెంబరు 13: ‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం త్వరలోనే ఒక కమిటీని నియమించి వారి సూచనలను సీఎంరేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతాను’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా తమకు హెల్త్ కార్డులు కావాలని, అవసరమైతే తమ మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి చెప్పినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఉపాధ్యాయ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తనని తెలిపారు. త్వరలోనే సీఎం నుంచి ప్రకటన వెలువడుతుందన్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని, ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఒక అధికారిక కమిటీ ద్వారా విషయ సేకరణ జరుపుతామని పేర్కొన్నారు.
Updated Date - Sep 14 , 2024 | 03:00 AM