ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ప్రజా విజయోత్సవాల’కు ప్రణాళిక

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:45 AM

రాష్ట్రంలో డిసెంబరు 1 నుంచి 9 వరకు నిర్వహించే ‘ప్రజా పాలన... ప్రజా విజయోత్సవాల’కు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • జిల్లాల వారీగా డాక్యుమెంట్లను రూపొందించండి:సీఎస్‌

రాష్ట్రంలో డిసెంబరు 1 నుంచి 9 వరకు నిర్వహించే ‘ప్రజా పాలన... ప్రజా విజయోత్సవాల’కు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏ రోజు ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలన్న వివరాలను అన్ని జిల్లాలకు పంపించామని తెలిపింది. జిల్లా, మండల స్థాయుల్లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. జిల్లాలవారీగా విజయోత్సవాలను డాక్యుమెంట్లుగా రూపొందించాలని, ఫొటోలు, కార్యక్రమాల హైలెట్స్‌తో సమగ్ర నివేదికలను పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.

Updated Date - Nov 30 , 2024 | 03:45 AM