ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Musi River: మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీ

ABN, Publish Date - Oct 06 , 2024 | 03:39 AM

మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • చైర్మన్‌గా సెర్ప్‌ సీఈవో, వైస్‌ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

  • కమిటీలో మరో 12 మంది సభ్యులు..

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా సెర్ప్‌ (ఎస్‌ఈఆర్‌పీ) సీఈఓ, వైస్‌ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు మరో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ శాఖల అధికారులున్నారు. మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఈ కమిటీ బాధ్యత.. నిర్వాసితులను వేరే ప్రాంతాలకు మార్చిన సమయంలో వచ్చే సమస్యలను ముందుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగిన సూచనలు, కార్యాచరణ నివేదికను 30 రోజుల్లో సమర్పించాల్సి ఉంటుంది.


ఇందులో భాగంగా.. పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లిన వారికి బతుకుదెరువు కోసం నైపుణ్య శిక్షణ అందిస్తారు. మహిళలను స్వయం సహకార బృందాల్లో చేర్చి, బ్యాంకుల సహకారంతో వడ్డీ లేని రుణాలిచ్చేలా కృషి చేస్తారు. అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటారు. మూసీ నిర్వాసిత కుటుంబాల్లో చదువుకునే విద్యార్థుల చదువు ఆగకుండా ఉండేలా చర్యలు చేపడతారు. ఈ పనులన్నీ సక్రమంగా కొనసాగించేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచిస్తారు.

Updated Date - Oct 06 , 2024 | 03:39 AM