ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మిల్లర్ల పూచీకత్తుకు పక్షం గడువు..!

ABN, Publish Date - Oct 31 , 2024 | 03:24 AM

ధాన్యం సేకరణకు కొత్త పాలసీని అమలులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. బ్యాంకు గ్యారెంటీలు.. లేదా.. సెక్యూరిటీ డిపాజిట్లను తీసుకోవటానికి రైస్‌మిల్లర్లకు పక్షం రోజుల గడువిచ్చింది.

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణకు కొత్త పాలసీని అమలులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. బ్యాంకు గ్యారెంటీలు.. లేదా.. సెక్యూరిటీ డిపాజిట్లను తీసుకోవటానికి రైస్‌మిల్లర్లకు పక్షం రోజుల గడువిచ్చింది. ధాన్యం సేకరణ పాలసీ ప్రకటనలో జాప్యం జరిగిన నేపథ్యంలో.. రైస్‌మిల్లర్లు ఆస్తులను తనఖా పెట్టడానికి, ఆర్థిక వనరులు సమకూర్చుకోవటానికి 15 రోజుల సమయం ఇస్తూ వెసులుబాటు కల్పించింది. వచ్చేనెల 15 నాటికి రైస్‌మిల్లర్లు ఖరీఫ్‌ ధాన్యం సేకరణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఆదేశాలు జారీచేశారు. రైస్‌మిలర్లతో సమన్వయానికి పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు(డీఎం), జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు బాధ్యతలను అప్పగించారు.


రైస్‌మిల్లర్లకు ధాన్యం అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు స్లాబులను ప్రకటించిన విషయం తెలిసిందే..! బకాయిలు లేని మిల్లర్లు... 10ు, బకాయిలను జరిమానాతో సహా తీర్చిన మిల్లర్లు 20ు, బకాయిలు తీర్చినా.. జరిమానా కట్టని మిల్లర్లు 25ు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంది. లేని పక్షంలో.. ఈ మూడు కేటగిరీల్లో ఉన్న రైస్‌ మిల్లర్లు 25ు సెక్యూరిటీ డిపాజిట్‌ సమర్పించాలి. కాగా, గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయగానే నేరుగా మిల్లులకు తరలించే విధానం అమల్లో ఉండేది. కొత్త పాలసీలో పాత పద్ధతికి స్వస్తి పలికారు. బ్యాంకు గ్యారెంటీ/సెక్యూరిటీ డిపాజిట్‌ పత్రాలు తయారై.. పౌరసరఫరాల సంస్థకు సమర్పించే వరకు మిల్లుల్లోకి ధాన్యం తరలించరు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ధాన్యాన్ని నేరుగా గోదాములకు తరలిస్తున్నారు.

Updated Date - Oct 31 , 2024 | 03:24 AM