ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఫోన్‌ ట్యాపింగ్‌, లగచర్ల కేసుల్లోనూ కేటీఆర్‌కు నోటీసులు?

ABN, Publish Date - Dec 15 , 2024 | 03:24 AM

కేటీఆర్‌ పేరు వినవస్తున్న అన్ని కేసుల్లోనూ త్వరలో ఆయనపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

  • ఒకదాని తర్వాత మరోదానికి ప్రణాళిక!

  • ఫార్ములా-ఈపై వచ్చే వారమే కేసు?

  • అల్లు అర్జున్‌ అరెస్టు అందరికీఓ ఝలక్‌

హైదరాబాద్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ పేరు వినవస్తున్న అన్ని కేసుల్లోనూ త్వరలో ఆయనపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌పై ముందుకు కదలడానికి ఏసీబీకి గవర్నర్‌ నుంచి ఆమోదం లభించడంతో ఆయన పాత్ర ఉందని చెబుతున్న ఇతర కేసుల్లోనూ పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌ పేరు ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌లో లేదు. కానీ, అరెస్టయిన పోలీసు అధికారి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎప్పుడైనా కేటీఆర్‌ తదితరుల పేర్లు జత చేసే అవకాశం రాష్ట్ర పోలీసులకు ఉంది. అలాగే, లగచర్ల కేసులోనూ ఇప్పటికే అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ స్ధానిక నేత సురేష్‌ వాంగ్మూలాలు, ఫోన్‌ కాల్స్‌ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో కేటీఆర్‌ పేరును నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించిన కేసుల్లో మాత్రమే గవర్నర్‌ అనుమతి అవసరం.


క్రిమినల్‌ కేసుల్లో గవర్నర్‌ ముందస్తు అనుమతి పోలీసు శాఖకు అవసరం లేదు. అయినప్పటికీ ఫార్ములా ఈ కేసును ముందుంచి మిగతా కేసుల్లోనూ కేటీఆర్‌ను విచారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోమవారం తర్వాత ఫార్ములా-ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని, ఆ తర్వాత కేటీఆర్‌కు నోటీసులు ఇస్తారని సమాచారం. ఈ కేసులో కేటీఆర్‌ మీద తదుపరి చర్యలు తీసుకున్న తర్వాత మిగతా కేసుల్లో నోటీసుల పరంపర మొదలవుతుందని అంటున్నారు. పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే నిందితుల్లో కేటీఆర్‌ను చేర్చే విషయంలో ముందుకు వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం ద్వారా వివిధ కేసుల్లో వాంటెడ్‌ లిస్టులో ఉన్న వారందరికీ ప్రభుత్వం ఒక ఝలక్‌ ఇచ్చినట్లయ్యిందని మాజీ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం అల్లు అర్జున్‌ అరెస్టు తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడిన మాటలను గమనిస్తే, చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్న వ్యాఖ్యల వెనుక అనేక అర్ధాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Updated Date - Dec 15 , 2024 | 03:24 AM