ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

loan waiver: రుణమాఫీలో స్వీయ ధ్రువీకరణ

ABN, Publish Date - Aug 26 , 2024 | 04:33 AM

రుణమాఫీకి కుటుంబ సభ్యులను నిర్ధారించే బాధ్యతను ప్రభుత్వం రైతులకే అప్పగించింది. స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్‌ డిక్లరేషన్‌)తో రైతులే తమ కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్‌ నంబర్లు, వయస్సు తదితర వివరాలను అందజేయాలని వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.

  • కుటుంబ సభ్యుల వివరాల నమోదు బాధ్యత రైతులకే..

  • తప్పుడు సమాచారం ఇస్తే మాఫీ మొత్తం రికవరీ

  • ఏవోలకు అందుబాటులోకి ‘సీఎల్‌డబ్ల్యూ’ యాప్‌

  • దశల్లో రైతుల వివరాలు.. చివరి దశలో ధ్రువపత్రం అప్‌లోడ్‌

  • రూ.2 లక్షలలోపు రుణమాఫీ కానివి 5,49,418 ఖాతాలు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీకి కుటుంబ సభ్యులను నిర్ధారించే బాధ్యతను ప్రభుత్వం రైతులకే అప్పగించింది. స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్‌ డిక్లరేషన్‌)తో రైతులే తమ కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్‌ నంబర్లు, వయస్సు తదితర వివరాలను అందజేయాలని వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ డిక్లరేషన్‌ తప్పు అయితే.. తాను పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తానని.. లేని పక్షంలో రికవరీ చేసే అధికారం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు ఉంటుందని పేర్కొంటూ రైతులు ప్రమాణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్‌లో రైతులు సంతకం చేసి, తమ మొబైల్‌ నంబర్‌ను అందజేయాలని వ్యవసాయ శాఖ తాజా ఆదేశాలు పేర్కొంటున్నాయి.


  • 8 దశల్లో పోర్టల్‌లో అప్‌లోడ్‌

కుటుంబ నిర్ధారణ కాని రైతుల ఖాతాలు 4,24,873, ఆధార్‌లో తప్పులున్నవి 1,24,545 ఉన్నాయి. మొత్తం కలిపి 5,49,418 మంది రైతులకు ఇంకా రుణమాఫీ అందాలి. దీనిపై వ్యవసాయశాఖ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఆదివారం నుంచి రుణమాఫీకి కొత్త పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు రుణమాఫీకి సంబంధించి ‘క్రాప్‌లోన్‌ వీవర్‌’(సీఎల్‌డబ్ల్యూ) వెబ్‌సైట్‌ ఉండేది. ఇప్పుడు రైతుభరోసా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి.. క్రాప్‌లోన్‌ వీవర్‌(సీఎల్‌డబ్ల్యూ)-2024 పోర్టల్‌ను రూపొందించారు. మండల వ్యవసాయ అధికారులకు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఇచ్చారు.


రుణమాఫీ పొందని రైతుల అభ్యంతరాలను ఏవోలు.. ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. రైతుల వివరాలు అప్‌లోడ్‌ చేయటానికి 8 దశలను నిర్దేశించారు. రైతులు తొలుత పోర్టల్‌లో ‘క్రాప్‌లోన్‌ వీవర్‌’ బటన్‌ను క్లిక్‌ చేసి.. మొబైల్‌ నంబర్‌ ఆధారంగా లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలను ఎంటర్‌ చేయాలి. మూడో దశలో రైతులు వ్యవసాయ రుణం ఉన్న బ్యాంకు వివరాలను అందజేయాలి.


ఆ తర్వాత రైతు పేరు లేదా ఆధార్‌ నంబర్‌తో సెర్చ్‌ చేస్తే.. వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ పేర్కొన్న కాలమ్స్‌లో కుటుంబ సభ్యుల వివరాలను అందజేయాలి. చివరగా ‘ప్రీవ్యూ’లో ఏవైనా తప్పులుంటే.. సరిచేసుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ ఉంటుంది. కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటోను, స్వీయ ధ్రువీకరణను అప్‌లోడ్‌ చేయాలి. కాగా.. ప్రస్తుతం రూ.2 లక్షల్లోపు రుణం ఉండి.. పెండింగ్‌లో ఉన్న 5.49 లక్షల మంది రైతులపైనే ప్రభుత్వం దృష్టి సారించింది.

Updated Date - Aug 26 , 2024 | 04:33 AM

Advertising
Advertising
<