ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాత గోనె సంచుల ధర సవరణ!?

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:35 AM

పాత గోనె సంచుల ధరపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ధాన్యం నింపడానికి ప్రభుత్వం సేకరించినప్పుడు ఎక్కువ ధర చెల్లించారని, ఇప్పుడు మిల్లర్ల నుంచి తిరిగి తీసుకోవడానికి తక్కువ ధరను నిర్ణయించడం ద్వారా పౌర సరఫరాల సంస్థకు నష్టం జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి.

  • రూ.15గా నిర్ణయించడంతో పౌరసరఫరాల

  • శాఖకు నష్టం వస్తుందన్న ఆరోపణలు పునరాలోచనలో పడ్డ రాష్ట్ర ప్రభుత్వం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై సీఎంవో ఆరా

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పాత గోనె సంచుల ధరపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ధాన్యం నింపడానికి ప్రభుత్వం సేకరించినప్పుడు ఎక్కువ ధర చెల్లించారని, ఇప్పుడు మిల్లర్ల నుంచి తిరిగి తీసుకోవడానికి తక్కువ ధరను నిర్ణయించడం ద్వారా పౌర సరఫరాల సంస్థకు నష్టం జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో గోనె సంచుల ధరను సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు ధాన్యం సేకరణపై కొత్త విధానం తయారు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ముందు పాత గోనె సంచుల ధరల సవరణ ప్రతిపాదన పెట్టే అవకాశాలున్నాయి. గడిచిన పంట కాలాల్లో ప్రభుత్వం నుంచి రైస్‌ మిల్లర్లు తీసుకొని.. తిరిగివ్వని గోనె సంచులకు ఇటీవల రూ.15.50 ధర ఖరారు చేసింది.


అయితే పదేళ్లలో ఆడిట్‌ చేయకపోవడంతో 250కోట్ల గోనె సంచులు రైస్‌మిల్లర్ల వద్దే ఉండిపోయాయి. ‘ఆంధ్రజ్యోతి’ ఈ ఉదంతాన్ని సోమవారం వెలుగులోకి తెచ్చింది. ‘రూ.3,875 కోట్ల గోనె సంచులను మింగేశారు!’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై సీఎం కార్యాలయ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. మిల్లర్ల వద్ద ఎన్ని గోనె సంచులున్నాయి? ఎంత ఆదాయం రావాల్సి ఉంది? ఇంతకాలం ఆడిట్‌ చేయకపోవడానికి కారణాలేంటి? తదితర అంశాలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. గోనె సంచుల సొమ్ము వసూ లుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం 10కోట్ల గోనె సంచులను మిల్లర్లు, రేషన్‌డీలర్లు, వ్యాపారుల నుంచి కొన్నప్పుడు రూ.30 ఎలా చెల్లించారు? ఇప్పుడు రూ.15.50 ఎందుకు ఖరారు చేశారన్న దానిపై సీఎంవో వివరణ కోరినట్లు సమాచారం.

Updated Date - Dec 03 , 2024 | 04:35 AM