ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News : జన్వాడ ఫామ్‌హౌస్‌ పరిశీలన

ABN, Publish Date - Aug 28 , 2024 | 05:36 AM

జన్వాడ రెవెన్యూ పరిధిలో మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందిన ఫామ్‌హౌ్‌సను రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు.

శంకర్‌పల్లి, మేడ్చల్‌ టౌన్‌, ఆగస్టు 27 : జన్వాడ రెవెన్యూ పరిధిలో మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందిన ఫామ్‌హౌ్‌సను రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఫామ్‌హౌ్‌సతోపాటు సమీపంలోని ఫిరంగి కాలువను పరిశీలించి ఆక్రమణలపై ఆరా తీశారు. కాలువ సర్వే బుధవారం నిర్వహించనున్నారు. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తున్న నేపథ్యంలో జన్వాడ ఫామ్‌ హౌస్‌ వద్ద అధికారుల పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైడ్రా పరిధి హైదరాబాద్‌ వరకే కావడం, ఫామ్‌ హౌస్‌ 111 జీవో పరిధిలో ఉండడంతో కూల్చివేతపై సందేహాలు ఉన్నాయి. సుమారు 27 ఎకరాల్లోఉన్న ఈ ఫామ్‌ హౌస్‌ తనది కాదని కేటీఆర్‌ చెబుతున్నప్పటికీ ఆయన భార్య శైలిమ, అత్త, స్నేహితుడు బద్వేల్‌ ప్రదీ్‌పరెడ్డి పేరున భూములు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

2020లో జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేశారన్న ఆరోపణలపై ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డిని అప్పట్లో జైలుకు పంపిన సంగతి తెలిసిందే. కాగా, మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడ గ్రామాన్ని హైడ్రా కమిషన్‌ రంగనాథ్‌ మంగళవారం సందర్శించారు. జీడిమెట్ల ఫాక్‌సాగర్‌తో పాటు దూలపల్లి, మైసమ్మగూడను సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ సమీపంలోని కాలువను, ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.

Updated Date - Aug 28 , 2024 | 05:36 AM

Advertising
Advertising
<