ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Criminal Investigation: అరికాళ్లూ పట్టిస్తాయి

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:10 AM

నేరం జరిగిన వెంటనే నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌. ఆ తర్వాత ఇంకా ఏమైనా ఘటనలతో వారికి సంబంధం ఉందా అని వేలిముద్రల స్కానింగ్‌తో తెలుసుకుంటారు.

  • ముఖం, కళ్లు కూడా స్కానింగ్‌

  • ఐదు ఠాణాల్లో పైలట్‌ ప్రాజెక్టు

  • డేటా ఇతర రాష్ట్రాలతో పంపకం

  • రష్యా నుంచి టెక్నాలజీపై శిక్షణ

హైదరాబాద్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): నేరం జరిగిన వెంటనే నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌. ఆ తర్వాత ఇంకా ఏమైనా ఘటనలతో వారికి సంబంధం ఉందా అని వేలిముద్రల స్కానింగ్‌తో తెలుసుకుంటారు. అయితే, వారు చేతులకు గ్లవ్స్‌ వాడితే కొంత ఇబ్బందే. ఈ పరిస్థితి నివారణకు ఇకమీదట కాలిముద్రలు కూడా తీసుకోవాలని రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్‌ ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నారు. దీనిప్రకారం నేరగాళ్లు ఎక్కడ దొరికినా వారి వేలిముద్రలను తీసుకుంటున్నారు. దీనికి అదనంగా ఆటోమేటెడ్‌ మల్టీమోడల్‌ బయోమెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌, ఎల్‌బీనగర్‌, పంజాగుట్టతో పాటు హనుమకొండ, సిద్దిపేట పోలీసు స్టేషన్లలో ప్రారంభించారు.


దీని ప్రకారం నిందితుల అరచేతి ముద్రలతో పాటు వారి ముఖం, కళ్లు, అరికాళ్లనూ స్కాన్‌ చేస్తారు. చేతి రాత, సంతకం, ఒడ్డు పొడవు, బరువును కూడా నమోదు చేసి డేటా రూపొందిస్తారు. ఈ సమాచారాన్ని దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌(సీసీఎన్‌టీఎ్‌స)తో పంచుకుంటారు. ఆన్‌లైన్‌తో అనుసంధానమైన పోలీసు స్టేషన్లన్నింటితో సీసీఎన్‌టీఎ్‌స ద్వారా నేరగాళ్ల సమాచారాన్ని పోల్చి చూసుకుంటారు. కాగా, తెలంగాణలోని వేలి ముద్రల (ఫింగర్‌ ప్రింట్‌) బ్యూరోలో 11 లక్షలకు పైగా నేరగాళ్ల డేటా ఉంది. ఇప్పుడు ముఖం, కళ్లు, అరికాళ్ల ముద్రలను సేకరించడం ద్వారా.. ముఖానికి మాస్క్‌ వేసుకున్నా కళ్లను బట్టి నిందితులను పట్టుకోవచ్చు. చేతికి గ్లవ్స్‌ వేసుకుంటే అరికాళ్ల ముద్రలతో గుర్తించవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ణానాన్ని ఇప్పటివరకు రష్యా వినియోగిస్తోంది. ఆ దేశ నిపుణుల నుంచి తెలంగాణ వేలిముద్రల (ఫింగర్‌ ప్రింట్స్‌) బ్యూరో సిబ్బంది శిక్షణ తీసుకున్నారు.

Updated Date - Dec 09 , 2024 | 03:10 AM