ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGPSC: ఫుడ్‌ సేప్టీ ఆఫీసర్‌ పోస్టులకు 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన!

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:52 AM

ఫుడ్‌ సేప్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీలో భాగంగా వచ్చేనెల 7, 8 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు నిర్ణయించారు.

  • జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు అభ్యర్థుల ఎంపిక

హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఫుడ్‌ సేప్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీలో భాగంగా వచ్చేనెల 7, 8 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఆ పరిశీలన ప్రక్రియ చేపడతారు. మరోవైపు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలోని కెమిస్ట్రీ, హిస్టరీ, ఫిజిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించిన జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.


  • మొదటి దశ బీ-ఫార్మసీ సీట్ల కేటాయింపు!

రాష్ట్రంలో 10,436 మంది అభ్యర్థులకు బీ- ఫార్మసీ సీట్లను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,854 బీఫార్మసీ సీట్లు ఉండగా, వీటి కోసం 16,145 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొదటి దశలో భాగంగా వారిలో 10,436 మందికి సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన వారు ఈనెల 30వ తేదీలోపు ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్‌ చేయాలి. కాగా, రెండవ దశ కౌన్సెలింగ్‌ నవంబరు 11 నుంచి నిర్వహించనున్నారు.

Updated Date - Oct 29 , 2024 | 04:52 AM