ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pending Bills: సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN, Publish Date - Nov 10 , 2024 | 02:22 AM

సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ సర్పంచుల ఫోరం డిమాండ్‌ చేసింది.

  • తెలంగాణ సర్పంచుల ఫోరం

పంజాగుట్ట, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ సర్పంచుల ఫోరం డిమాండ్‌ చేసింది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచులు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారని ఫోరంఅధ్యక్షుడు జి. లక్ష్మీ నరసింహ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం ప్రధాన కార్యదర్శి పి.ప్రణీల్‌ చందర్‌, ఉపాధ్యక్షుడు జి.బలవంత్‌ రెడ్డి, తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. బిల్లులు అందక, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసిన అప్పులు తీర్చలేక పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో స్పందన లేదని ఆయన ఆరోపించారు.


తమ పదవీ కాలం ముగిసి పది నెలలవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం తమకు పెండింగ్‌ బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు అందక ఆత్మహత్య చేసుకున్న, విధి నిర్వహణలో మృతి చెందిన సర్పంచుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను ఈ నెల చివరి లోగా నెరవేర్చాలని, లేకపోతే ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.

Updated Date - Nov 10 , 2024 | 02:22 AM