ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విదేశాలకు తెలంగాణ బియ్యం

ABN, Publish Date - Nov 13 , 2024 | 04:09 AM

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయటానికి కేవలం భారత ఆహార సంస్థపైన, రైస్‌ మిల్లర్లపైనే ఆధారపడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

  • దిగుమతుల మీద ఆధారపడే దేశాలపై సర్కారు నజర్‌

  • ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి

  • ఈ దేశాల నుంచి డిమాండ్‌ లేఖలుతెప్పించే కసరత్తు

  • కేంద్రం అనుమతితో కార్పొరేషన్‌ ద్వారా ఎగుమతి

  • బంగ్లాదేశ్‌లో వరదల ప్రభావంతో తగ్గిపోయిన బియ్యం ఉత్పత్తి

  • అక్కడి ప్రభుత్వాల నుంచి డిమాండ్‌ లేఖలుతెప్పించేలా కసరత్తు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయటానికి కేవలం భారత ఆహార సంస్థపైన, రైస్‌ మిల్లర్లపైనే ఆధారపడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. విదేశాలకు మన బియ్యాన్ని ఎగుమతి చేసే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. బియ్యం కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే మలేషియా, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా దేశాలతోపాటు.. భారీవర్షాలు, వరదల ప్రభావంతో వరి పంట దెబ్బతిన్న బంగ్లాదేశ్‌పైనా సర్కారు దృష్టిసారించింది. కేంద్రం అనుమతి తీసుకుని, ఆయా దేశాలకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచే నేరుగా బియ్యం ఎగుమతి చేయాలనే ప్రాథమిక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇంత భారీ ఎత్తున ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని రాష్ట్రంలో నిల్వచేయడం సాధ్యంకాదు. రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు పోగా మిగిలిన బియ్యంలో ఎంత వీలైతే అంత... బయటకు పంపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. రైస్‌ మిల్లర్లకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) అప్పగించడానికి బ్యాంకు గ్యారెంటీని తప్పనిసరి చేస్తూ సర్కారు ఈ ఖరీ్‌ఫలో కొత్తగా ధాన్యం సేకరణ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రైస్‌మిల్లర్లు విముఖత వ్యక్తంచేస్తున్నారు.


  • కష్టమేమీ కాదు...

మధ్యంతర గోదాములకు 30 లక్షల టన్నులు, అంతకంటే తక్కువ వచ్చినా.. మిల్లింగ్‌ చేయించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రైస్‌ మిల్లర్ల అంచనా ప్రకారం మధ్యంతర గోదాములకు 10-15 లక్షల టన్నుల దాకా ధాన్యం వచ్చే అవకాశాలున్నాయి. ఇండోనేషియాలో బియ్యం డిమాండ్‌ 20 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఫిలిప్పీన్స్‌లో 30 లక్షల టన్నులు, మలేషియాలో 5 లక్షల టన్నులుగా ఉందని.. జాతీయ బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షులు బీవీ కృష్ణారావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల 50 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యానికి టెండర్లు పిలిచారని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి పలువురు రైస్‌మిల్లర్లు ఇప్పటికే విదేశాలకు బియ్యం ఎగుమతులు చేస్తున్నారు. ఇదే క్రమంలో పౌరసరఫరాల సంస్థ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీంతో సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తమ్‌ ఇటీవల ఫిలిప్పీన్స్‌ అధికారులతో దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బియ్యం ఎంతకావాలో ఇండెంట్‌ పంపిస్తే.. తెలంగాణ నుంచి ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రెండు రోజుల క్రితమే మలేషియాలో పర్యటించారు. అక్కడి బియ్యం దిగుమతిదారులతో సమావేశమై.. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే బియ్యం నాణ్యత గురించి వారికి వివరించారు. దీంతో మన బియ్యం దిగుమతి చేసుకోవడానికి వారు అంగీకారం తెలిపారు.


  • ధాన్యం మధ్యంతర గోదాములకు

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రారంభమైనా.. ఇప్పటికీ కొందరు మిల్లర్లు ధాన్యం దించుకోవట్లేదు. దీంతో.. రైస్‌ మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావించిన సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. రైస్‌ మిల్లర్లు మొండికేసిన చోట.. అక్కడి ధాన్యాన్ని మధ్యంతర గోదాములకు తరలించాలని నిర్ణయించింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆఽధ్వర్యంలో ఉన్న గోదాముల్లో 30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖాళీ జాగాను పౌరసరఫరాల సంస్థ అధీనంలోకి తీసుకుంది. ఇప్పటివరకూ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో.. అధిక భాగాన్ని ప్రభుత్వ గోదాములకే తరలించటం గమనార్హం. అయితే.. బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి, ధాన్యం తీసుకొని, సకాలంలో మిల్లింగ్‌ చేసి బియ్యం సరఫరా చేసిన మిల్లర్లకు మళ్లీ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ నిల్వలు అలాగే ఉంటే.. ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 04:11 AM