TGSRTC: సంకాంత్రి వేళ.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ
ABN, Publish Date - Dec 31 , 2024 | 08:13 PM
TGSRTC: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని... హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్, డిసెంబర్ 31: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోన్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థం 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించింది. 557 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నామని సంస్థ పేర్కొంది.
అందుకోసం హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేలా ఆర్టీసీ అధికారులను నియమించామని తెలిపింది. ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తున్నామని వివరించింది. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామంది.
గత ఏడాది సంక్రాంతి సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకోగా.. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో 5,246 బస్సులను నడిపినట్లు పేర్కొంది. గత సంక్రాంతి పండగ సమయంలో అనుభవాన్ని దృష్ట్యిలో పెట్టుకొని.. ఈ సారి 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని వివరించింది. 2025, జనవరి 9వ తేది నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.
Also Read: రహదారిపై ఆగిన కారు.. రంగంలోకి ఎద్దులు
అలాగే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని వివరించింది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని పేర్కొంది. ఇక పండగ అయిపోయిన అనంతరం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
Also Read: మీ బ్యాగు తగిలించుకొన్న తీరే.. మీరేమిటో చెబుతోంది
అయితే సంక్రాంతి ఆపరేషన్స్.. తమకు ఎంతో కీలకమని టీజీఎస్‌ఆర్టీసీకి తెలిపింది. అందుకోసం పూర్తిగా సన్నద్ధం కావాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఇప్పటికే సూచించామని చెప్పింది. ఇక హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది.
Also Read: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..
Also Read: గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని గుర్తు చేసింది. తమ ప్రయాణ సమయంలో విధిగా జీరో టికెట్లు తీసుకోవాలని మహిళలకు సూచించింది. ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దంటూ ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ హితవు పలికింది.
Also Read: సిట్ సభ్యులపై విమర్శలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సంక్రాంతి పండగ వేళ.. సొంతూళ్లకు వెళ్లే వారు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించింది. ఇక ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in వెబ్ సైట్‌లో చేసుకోవాలని పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని ప్రజలకు వివరించింది.
For Telangana News And Telugu News
Updated Date - Dec 31 , 2024 | 09:48 PM