ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGSRTC: కార్తీక మాసంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:40 PM

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలోని ఏడు డిపోల అధికారులతో నగరంలోని ప్రాంతీయ మేనేజరు కార్యాలయంలో బస్సుల ఏర్పాట్లపై ఆర్‌ఎం సరిరాం(RM Sariram) ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఖమ్మం: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలోని ఏడు డిపోల అధికారులతో నగరంలోని ప్రాంతీయ మేనేజరు కార్యాలయంలో బస్సుల ఏర్పాట్లపై ఆర్‌ఎం సరిరాం(RM Sariram) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని పంచరామాలు, అరుణాచలం, శబరిమల, అన్నవరం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఈ సమావేశంలో చర్చించారు. పంచరామాలకు నవంబరు 3 నుంచి 10వరకు, 17 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం ఖమ్మం జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: శాంపిల్స్‌ మేమిచ్చాం.. మీరివ్వండి


అన్నవరానికి నవంబరు 3 నుంచి 10వ తేదీవరకు, 14న కార్తీక పౌర్ణమిన, 17 నుంచి 24 వరకు రీజియన్‌ పరిధిలో బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అరుణాచలానికి నవంబరు 13న రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల నుంచి బస్సులు బయలుదేరి తిరిగి 16న ఆయా డిపోలకు చేరుకుంటాయని తెలిపారు. గిరిప్రదర్శనకు ముందస్తు టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు.


శబరిమలకు అద్దె ప్రతిపాదికన రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. ఈ బస్సులో ఇద్దరు స్వాములకు (గురు స్వామి, మణికంఠ స్వామి) ఇద్దరు వంటమనుషులు, సామాన్లు సర్దేందుకు ఒక వ్యక్తికి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు తెలిపారు. భక్తులు మరిన్ని వివరాలకు మీమీ పరిధిలోని ఆర్టీసీ డిపోలలో సంప్రదించాలని తెలిపారు. 30 నుంచి 40మంది భక్తులు ఉంటే అగిడిన తేదీల్లో బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ వల్లే విద్యుత్‌ చార్జీల పెంపుపై వెనక్కి

ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2024 | 01:40 PM