Delhi Liquor Case: కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై ముగిసిన విచారణ
ABN, Publish Date - May 21 , 2024 | 03:06 PM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై మంగళవారం విచారణ ముగిసింది. ఈడీ దాఖలు చేసిన ఏడవ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. 8 వేల పేజీలతో కూడిన ఛార్జిషీటును ఈడీ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై మంగళవారం విచారణ ముగిసింది. ఈడీ దాఖలు చేసిన ఏడవ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. 8 వేల పేజీలతో కూడిన ఛార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత సహా 5 మంది నిందితులపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై వాదనల అనంతరం తుది ఉత్తర్వులను కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరించనున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌పై ఈ నెల 28న వాదనలు మొదలుకానున్నాయి.
Updated Date - May 21 , 2024 | 03:06 PM