Telangana Politcs: ఈ ఐదుగురు తమకు తాము ఓటేసుకోలేరు..
ABN, Publish Date - May 06 , 2024 | 05:42 AM
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైనవో ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ఎన్నికల సంఘం మొదలుకుని, సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల వరకు ‘ఓటు వేయాలంటూ’ ప్రజలకు పిలుపునిస్తుంటారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైనవో ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ఎన్నికల సంఘం మొదలుకుని, సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల వరకు ‘ఓటు వేయాలంటూ’ ప్రజలకు పిలుపునిస్తుంటారు. ఇక అభ్యర్థులైతే ‘మీ విలువైన ఓటు వేసి’ ఆశీర్వదించాలంటూ వేడుకుంటుంటారు. అయితే, ఇలాంటివారు ఐదుగురు తమ ఓటు తమకు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. హైదరాబాద్ మజ్లిస్ అభ్యర్థి, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇది చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది.
కాగా, చేవెళ్లలో మజ్లిస్ అభ్యర్థిని నిలపలేదు. ఇప్పుడు అసదుద్దీన్ వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన పరిస్థితి. అసద్ ఇప్పటి వరకు తన ఓటు తనకు ఎప్పుడూ వేసుకోలేదు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కంటోన్మెంట్ (మల్కాజిగిరి ఎంపీ)లో ఓటుంది. ఈమె కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజిగిరి ఎంపీ స్థానానికీ ఓటు వేయనున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్‌కు జూబ్లీహిల్స్ (సికింద్రాబాద్ ఎంపీ)లో ఓటుంది. కాగా, చేవెళ్ల బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ ఓటరు. ఈ స్థానం మల్కాజిగిరి ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి తాండూరులో ఓటుంది. ఈమె కూడా తన ఓటు తనకు వేసుకోలేరు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాల్లో పోటీకి దిగిన నాలుగు పార్టీల అభ్యర్థులు ఒకే విధమైన పరిస్థితి ఎదుర్కొంటుండడం విచిత్రమే.
Updated Date - May 06 , 2024 | 05:42 AM