Phone Tapping Case: ముగిసిన ప్రణీత్ మూడోరోజు విచారణ.. వెలుగులోకి మరిన్ని విషయాలు
ABN, Publish Date - Mar 19 , 2024 | 09:41 PM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు (Praneeth Rao) మూడో రోజు కస్టడీ విచారణ ముగిసింది. దర్యాప్తు బృందం (Investigation Team) అతడిని దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణలో భాగంగానే.. ప్రణీత్‌తో కలిసి పనిచేసిన అధికారుల వివరాలు దర్యాప్తు బృందం సేకరించింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు (Praneeth Rao) మూడో రోజు కస్టడీ విచారణ ముగిసింది. దర్యాప్తు బృందం (Investigation Team) అతడిని దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణలో భాగంగానే.. ప్రణీత్‌తో కలిసి పనిచేసిన అధికారుల వివరాలు దర్యాప్తు బృందం సేకరించింది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో.. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. డిసెంబర్ 4వ తేదీన ప్రణీత్‌తో పాటు ఎస్ఐబీ (Special Investigation Branch) కార్యాలయానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు.
మూడో రోజు విచారణలో భాగంగా.. ప్రణీత్ రావు కొందరు వ్యక్తుల పేర్లను వెల్లడించినట్లు తెలిసింది. దీంతో.. ఆ అధికారులకు నోటీసులు ఇచ్చి, వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రణీత్ వరంగల్‌కు చెందిన ఇద్దరు సీఐల పేర్లు వెల్లడించడంతో.. వారిని అదుపులోకి తీసుకొని, రహస్య ప్రదేశంలో విచారించారు. ఆ ఇద్దరి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఎస్ఐబీకి ప్రణీత్ రాకముందు నుంచే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే.. ఈ కేసులో కీలకంగా మారిన ఎస్ఐబీ కార్యాలయం నోడల్ ఆఫీసర్ ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు.
హైకోర్టుని ఆశ్రయించిన ప్రణీత్ రావ్
మరోవైపు.. ఈ కేసులో ప్రణీత్ రావు హైకోర్టుని (High Court) ఆశ్రయించాడు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అతని తరఫు న్యాయవాది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా.. కిందికోర్టు కస్టడీకి ఇచ్చిందని ఆ పిటిషన్‌లో ప్రణీత్ పేర్కొన్నాడు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, పోలీస్ స్టేషన్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని తెలిపాడు. విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.
దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని, ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిందేనని ప్రణీత్ రావు ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని అన్నాడు. బంధువులతో పాటు న్యాయవాదిని కూడా కలిసేందుకు అనుమతించడం లేదన్నాడు. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డీ.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరాడు. ఇప్పటికే సమాచారం అందించాను కాబట్టి తన కస్టడీని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్‌ని విచారించిన హైకోర్టు.. ప్రణీత్ కస్టడీపై పోలీసులు వివరణ కోరుతూ రేపటికి వాయిదా వేసింది.
Updated Date - Mar 19 , 2024 | 09:42 PM