ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vemulawada: రాజన్న కోడెలను అమ్ముకున్నారు!

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:02 AM

వేములవాడ రాజన్న ఆలయ గోశాల నుంచి కోడెలు, దూడలను వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు తీసుకొచ్చి అక్రమంగా అమ్ముకొన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

  • ముగ్గురి అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు

  • కోడెల గోల్‌మాల్‌పై ఆలయ అధికారుల విచారణ

గీసుగొండ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న ఆలయ గోశాల నుంచి కోడెలు, దూడలను వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు తీసుకొచ్చి అక్రమంగా అమ్ముకొన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో భక్తులు నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనుగొండకు చెందిన మాదాసి రాంబాబు రాజేశ్వరి సొసైటీ ద్వారా వేములవాడ గోశాల నుంచి కోడెలను, లేగదూడలను తీసుకొచ్చి అమ్ముకుంటున్నట్లు గత నెల 29న వెలగందుల రాజు గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న రాంబాబుపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. రాజన్న ఆలయ గోశాల నుంచి రెండు దఫాల్లో 66 కోడెలను తీసుకొచ్చినట్లు గుర్తించారు.


అనంతారానికి చెందిన మంద స్వామి, వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తికి చెందిన పసునూటి శ్యామ్‌ కలిసి పలువురు రైతుల నుంచి ఆధార్‌కార్డులతో పాటు వారి భూమి పత్రాలను సేకరించి గోశాల అధికారులకు అందించి.. కోడెలను, దూడలను తీసుకొచ్చారు. ఇలా తెచ్చినవాటిలో 26 కోడెలను ఆలయ గోశాలకే తిరిగి ఇచ్చినట్లు, మరికొన్ని పారిపోగా, కొన్ని మృతి చెందినట్లు పోలీసులకు చెప్పారు. మరో 11 కోడెలు గట్టుకిందపల్లిలో ఉన్నట్లు తెలిపారు. పారిపోయినట్లుగా చెప్పిన కోడెలను ముగ్గురు కలిసి అమ్ముకున్నట్లు తేలడంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. గోశాల నుంచి తీసుకొచ్చిన కోడెల వివరాలను తెలుసుకునేందుకు ఆలయ అధికారులు బుధవారం మనుగొండ, అనంతారం గ్రామాల్లో విచారణ జరిపారు. ఆధార్‌ కార్డుల్లోని చిరునామాల ఆధారంగా రైతుల ఇళ్లకు వెళ్లారు. మనుగొండలో రైతుల ఇళ్లకు తాళం వేసి ఉండడంతో పొరుగు వారిని ఆరా తీశారు. గోశాలకు చెందిన కోడె మృతి చెందినట్లు తెలుసుకున్న ఆలయ అధికారులు ఆ కోడెను పాతిపెట్టిన ప్రాంతంలో తవ్వించి పంచనామా చేయించారు.

Updated Date - Dec 12 , 2024 | 03:02 AM