CM Revanth Reddy: నేడు ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్‌కు వెళ్లనున్న రేవంత్..
ABN, Publish Date - Aug 08 , 2024 | 09:12 AM
ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ అయిన ఆపిల్ పార్క్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ వెళ్లనున్నారు. ఆపిల్ మ్యానిఫాక్చర్ టీమ్‌తో రేవంత్ భేటీ కానున్నారు. ట్రినేట్ కంపెనీ సీఈఓతో చర్చించనున్నారు.
హైదరాబాద్: ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ అయిన ఆపిల్ పార్క్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ వెళ్లనున్నారు. ఆపిల్ మ్యానిఫాక్చర్ టీమ్‌తో రేవంత్ భేటీ కానున్నారు. ట్రినేట్ కంపెనీ సీఈఓతో చర్చించనున్నారు. ఆరమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో భేటీ అయి హైదారాబాద్‌లో ఆ కంపెనీ డేటా సెంటర్స్ విస్తరణ కోసం చర్చలు నిర్వహించనున్నారు. పలువురు టెక్ కంపెనీల ప్రతినిధులతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అంగెన్ సంస్థ సీనియర్ లీడర్‌షిప్‌తో పెట్టుబడులపై చర్చలు నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ రెనేశాస్ తో, మ్యానిఫాక్చర్ సంస్థ అమాట్‌తో ఇన్వెస్ట్‌మెంట్‌పై చర్చలు నిర్వహించనున్నారు.
పలు బిజినెస్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. నిన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో చర్చలు సఫలం కానున్నాయి. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో 400 కోట్లు పెట్టుబడితో ఇన్జెక్టబుల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేలా వివింట్ సంస్థ కృషి చేస్తామని తెలిపింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కోసం కార్నింగ్ కంపెనీ సహకరిస్తామని తెలిపింది. అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగంలో సహకారం కోసం కార్నింగ్ కంపెనీతో తెలంగాణ సర్కార్ ఎంఓయూ కుదుర్చుకుంది.
తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. మంగళవారం న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. కాగా, బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ ‘స్వచ్ఛ బయో’ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. త్వరలో రాష్ట్రంలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. మొదటి దశలో రూ.1000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నిర్మించి, 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇక నిన్న చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను రేవంత్ రెడ్డి, టీమ్ సందర్శించారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ సీనియర్ లీడర్షిప్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఐటీ సర్వీస్ అలయన్స్‌లతో రాష్ట్రంలో పెట్టుబడులపై సమావేశం నిర్వహించారు.
Updated Date - Aug 08 , 2024 | 09:12 AM