ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నేడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్ చర్చలు..

ABN, Publish Date - Aug 06 , 2024 | 07:27 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. నిన్న కాగ్నిజెంట్ సీఈఓతో పాటు సిగ్న కంపెనీ సీనియర్‌లతో రేవంత్ చర్చలు జరిపారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. నిన్న కాగ్నిజెంట్ సీఈఓతో పాటు సిగ్న కంపెనీ సీనియర్‌లతో రేవంత్ చర్చలు జరిపారు. అనంతరం అమెరికాలో ఉన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. నేడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఈ రోజు పెప్సికో యాజమాన్యంతో రేవంత్ చర్చలు జరపనున్నారు. అలాగే హెచ్‌సీఏ సీనియర్ లీడర్షిప్‌తో రేవంత్ భేటీ అవనున్నారు. అనంతరం నేడు న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళ్లనున్నారు. వాషింగ్టన్‌లో పలు ఆరోగ్య, టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో రేవంత్ భేటీ కానున్నారు. అనంతరం వాషింగ్టన్ నుంచి డల్లాస్ వెళ్లనున్నారు.


కాగ్నిజెంట్ ప్రతినిధులతో నిన్న జరిగిన చర్చల్లో 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్ పెట్టడానికి ఒకే చెప్పింది.15 వేల మందికి కాగ్నిజెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. రూ. 839 కోట్ల పెట్టుబడికి వాల్స్ కర్రా ఓకే చెప్పారు. సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని ఎన్ఆర్ఐ‌లకు రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ విజయంలో ఎన్ఆర్ఐల సహకారం ఉందని రేవంత్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు జరిగిన విధ్వసంతో పాటు ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ఎన్ఆర్‌ఐలకు సీఎం వివరించారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని రేవంత్ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి నేడు నేడు అమెరికా చేరుకోనున్నారు.


రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన రేవంత్.. ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్‌ నగరానికి చేరుకున్నారు. ఇక్కడ ఆరు రోజుల పాటు పర్యటించనున్నారు. అనంతరం దక్షిణ కొరియాకు వెళ్తారు. ఈ పది రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిపతులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది.

Updated Date - Aug 06 , 2024 | 07:27 AM

Advertising
Advertising
<