Jaggareddy: రుణమాఫీ.. రేవంత్ చేసి చూపిస్తారు..
ABN, Publish Date - May 08 , 2024 | 05:27 AM
రైతులందరికీ ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని, దైవసాక్షిగా కూడా ప్రమాణం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
ఆయన మాట ఇస్తే తప్పరు.. దుబ్బాక రైతులకు నాదీ గ్యారెంటీ
దుబ్బాక నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వండి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
దుబ్బాక, మే 7: రైతులందరికీ ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని, దైవసాక్షిగా కూడా ప్రమాణం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రుణమాఫీ విషయంలో గతంలో కేసీఆర్ రెండుసార్లు మోసం చేశారని, ఇపుడు సీఎం రేవంత్ కచ్చితంగా పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంటారని, తాను కూడా మాటిస్తున్నానని చెప్పారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఖజానానంతా కేసీఆర్ ఖతం చేశారని, లేదంటే రుణమాఫీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయేదని చెప్పారు. దుబ్బాక ప్రజలకు తాను మాట ఇస్తున్నానని, రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు. అధికారికంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అయినా.. అధికారం చెరుకు శ్రీనివా్‌సరెడ్డిదేనని అన్నారు. దుబ్బాక ప్రజలు, వ్యాపారులు ఆలోచించి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు 50 వేల మెజార్టీ అందిస్తే, దుబ్బాక అభివృద్ధికి తాను గ్యారెంటీ అని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌తో ఇప్పుడు ఏ పనీ కాదని, హరీశ్‌రావు, ప్రభాకర్‌రెడ్డిలతోనూ పనులు కావన్నారు. తాను శ్రీనివా్‌సరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్తానని, దుబ్బాకకు కావల్సిన పనులన్నీ చేయిస్తానని హామీ ఇచ్చారు.
Updated Date - May 08 , 2024 | 05:27 AM