ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KBR Park: కేబీఆర్‌ చుట్టూ ట్రాఫిక్‌ ఫ్రీ!

ABN, Publish Date - Sep 29 , 2024 | 03:38 AM

హైదరాబాద్‌ మహా నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు చుట్టూ ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్యలకు త్వరలో చెక్‌ పడనుంది.

  • పార్క్‌ చుట్టూ అండర్‌పా్‌సలు, ప్లైఓవర్లు.. సిగ్నళ్లు, యూటర్న్‌లు లేకుండా చర్యలు

  • రూ.826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ధి

  • పాలనాపరమైన అనుమతులిచ్చిన సర్కార్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహా నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు చుట్టూ ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్యలకు త్వరలో చెక్‌ పడనుంది. ఈ జంక్షన్లను సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు యూటర్న్‌లు కాకుండా.. అండర్‌పా్‌సలు, ప్లైఓవర్ల నిర్మాణం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబీఆర్‌ పార్కు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ఇకపై ఎలాంటి యూటర్న్‌లు లేకుండా రయ్యుమంటూ దూసుకెళ్లే విధంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనుంది. ఈ మేరకు పార్కు చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను రూ.826కోట్లతో అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి నిధులను సీఎం మంజూరు చేశారు. పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఆరు జంక్షన్లను హెచ్‌సీటీ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడంతోపాటు డిజైన్లను సైతం రూపొందించారు. త్వరలోనే జంక్షన్ల అభివృద్ధి పనులను పట్టాలెక్కించనున్నారు. ఆరు జంక్షన్లను 2దశల్లో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


  • నగరం నడిబొడ్డుగా మారిన కేబీఆర్‌ పార్కు..

ఒకప్పుడు హైదరాబాద్‌ మహా నగరానికి సుదూరంగా.. కొండలు, గుట్టల మధ్యన ఉన్న కేబీఆర్‌ పార్కు ప్రస్తుతం నగర నడిబొడ్డుగా మారింది. నగరంలోని ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌.. ఇలా ఆయా ప్రాంతాలను అనుసంధానం చేసే ముఖ్యమైన రోడ్లన్నీ కేబీఆర్‌ పార్కు నుంచే ఉన్నాయి. దాంతోపాటు కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, కృష్ణానగర్‌ తదితర ప్రాంతాలన్నీ వ్యాపార, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఐటీ, సినీ, రాజకీయ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ ప్రాంతంలోనే నివాసముంటారు. ఇలా అనేక ప్రాంతాలకు అనుసంధానమైన కేబీఆర్‌ పార్కు చుట్టురా రోడ్లు ఏ సమయంలోనైనా రద్దీగా ఉంటాయి. జంక్షన్లలో కిలోమీటర్‌ మేర వాహనాలు బారులు తీరుతాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


  • పార్కుకు ఇబ్బందుల్లేకుండా..

హైదరాబాద్‌ మహా నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే అనేక జంక్షన్లను సిగ్నల్‌ ఫ్రీగా మార్చా రు. అయితే కేబీఆర్‌ పార్కును సిగ్నల్‌ ఫ్రీగా మార్చడం ఎంతో సవాళ్లతో కూడుకున్నదిగా మారిం ది. ఇందుకోసం గత ప్రభుత్వంలో కొన్ని డిజైన్లు రూపొందించగా.. అవి కేబీఆర్‌ పార్కును ధ్వంసం చేసేవిధంగా ఉన్నాయంటూ పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కూడా ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో కేబీఆర్‌ పార్కుకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతమున్న రోడ్లలోనే ప్లైఓవర్లు, అండర్‌పా్‌సలు నిర్మించేలా డిజైన్లు రూపొందించారు. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఎక్కడా సిగ్నల్‌ ఉండకుండా, ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా డిజైన్‌ చేశారు. ప్రస్తుతమున్న ఆరు జంక్షన్లలో కుడివైపు మార్గంలో(సవ్య దిశలో) అండర్‌పా్‌సలను నిర్మించనున్నారు. ఎడమ వైపు మార్గంలో (అపసవ్య దిశలో) ప్లైఓవర్లను నిర్మించనున్నారు. వర్షాకాలంలో అండర్‌పా్‌సలలోకి వర్షపునీరు వచ్చినా.. అవి లేకుండా చేసేలా నిర్మాణాల డిజైన్లను రూపొందించారు.


రూ.421 కోట్లతో ప్యాకేజీ-1లో..

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు జంక్షన్‌ 1. రోడ్డు నెం.45 నుంచి కేబీఆర్‌ పార్కు యూసఫ్‌గూడ వైపు వై ఆకారంలో అండర్‌పాస్‌

2. కేబీఆర్‌ పార్కు ప్రవేశం నుంచి రోడ్డు నెం.36 వరకు నాలుగు లైన్ల ప్లైఓవర్‌

3. యూసఫ్‌గూడ వైపు నుంచి రోడ్డు నెం.45 జంక్షన్‌ వరకు రెండు లైన్ల ప్లైఓవర్‌


కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ ముగ్ధ జంక్షన్‌

1. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు 2 లేన్ల అండర్‌పాస్‌

2. పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మూడు లేన్ల ప్లైఓవర్‌

3. కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ జంక్షన్‌ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్‌ పాస్‌


రూ.40 5కోట్లతో ప్యాకేజీ-2లో..

రోడ్‌ నెం.45 జంక్షన్‌

1. ఫిల్మ్‌ నగర్‌ జంక్షన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వైపు వరకు అండర్‌ పాస్‌

2. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి రోడ్‌ నెంబర్‌-45 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్‌


ఫిలింనగర్‌ జంక్షన్‌

1. అగ్రసేన్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌ నెం.45 జంక్షన్‌ వరకు 2 లైన్ల అండర్‌పాస్‌

2. ఫిలింనగర్‌ జంక్షన్‌ నుంచి అగ్రసేన్‌ జంక్షన్‌ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్‌

మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌

1. క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ నుంచి ఫిలింనగర్‌ జంక్షన్‌ వరకు అండర్‌ పాస్‌

2. ఫిలింనగర్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌ నెంబర్‌-12 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్‌

క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌

1. కేబీఆర్‌ పార్కు నుంచి అగ్రసేన్‌ జంక్షన్‌ వరకు రెండు లైన్ల అండర్‌ పాస్‌

2. అగ్రసేన్‌ జంక్షన్‌ నుంచి రోడ్డు నెంబర్‌-10 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్‌

Updated Date - Sep 29 , 2024 | 03:38 AM