ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒకే రోజు ఐఏఎఫ్‌, ఆర్మీ దంపతుల బలవన్మరణం

ABN, Publish Date - Oct 18 , 2024 | 04:16 AM

ఆ దంపతులిద్దరూ భారత సాయుధ దళాల్లో పని చేస్తున్నారు. భర్త ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎ్‌ఫ)లో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా, భార్య ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

  • ఆగ్రాలో భర్త, ఢిల్లీలో భార్య ఆత్మహత్య

  • భర్త మృతదేహంతోపాటే నా దహనసంస్కారాలు చేయండి

  • సూసైడ్‌ నోట్‌లో భార్య కోరిక

న్యూఢిల్లీ, అక్టోబరు 17: ఆ దంపతులిద్దరూ భారత సాయుధ దళాల్లో పని చేస్తున్నారు. భర్త ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎ్‌ఫ)లో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా, భార్య ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కారణం ఏమై ఉంటోందోగానీ వీరిద్దరూ ఒకే రోజు వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న వీరు మంగళవారం ఇలా తనువు చాలించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. దీన్‌ దయాళ్‌ దీప్‌ (32) ఆగ్రాలోని ఖేరియా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఐఏఎఫ్‌ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా.. ఆయన భార్య కెప్టెన్‌ రేణు తన్వర్‌ అదే నగరంలో మిలటరీ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఆగ్రాలో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లోని తన నివాస క్వార్టర్స్‌లో దీప్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆఫీసర్స్‌ మెస్‌లో తన్వర్‌ బలవన్మరణం చెందారు. తన్వర్‌ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్యం కోసం సోమవారం ఢిల్లీ వెళ్లారు.


తన్వర్‌ ఆత్మహత ్య గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దీప్‌ నివాస క్వార్టర్స్‌లో మాత్రం ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. తన భర్త మృతదేహంతోపాటే తన దహన సంస్కారాలు నిర్వహించాలని తన్వర్‌ తన సూసైడ్‌ నోట్‌లో కోరారు. తన్వర్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె తల్లి, సోదరుడు ఎయిమ్స్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. కాగా రాత్రి భోజనం చేసేటప్పుడు దీప్‌ తన సహోద్యోగులతో సరదాగానే కబుర్లు చెప్పారని, ఆయనలో ఎలాంటి ఒత్తిడి లేదా ఆందోళన కనిపించలేదని అధికారులు పోలీసులకు తెలిపారు. తర్వాత తన క్వార్టర్స్‌కు దీప్‌ వెళ్లాడని, ఉదయం ఆయన ఎంతకూ లేవకపోవడంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి చూసే సరికి ఉరికి వేలాడుతున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. ఆయన మృతి పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 18 , 2024 | 04:16 AM