ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ts News: సాక్ష్యం చెప్పకుంటే రూ.కోటి ఇస్తామని ప్రలోభాలు.. ఏం జరిగిందంటే..?

ABN, Publish Date - Jan 31 , 2024 | 02:32 PM

భువనగిరి జిల్లా మోట కొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే యాదగిరి గౌడ్ 2013లో హత్యకు గురయ్యాడు. ఆ హత్య కేసులో సాక్ష్యం చెప్పకుంటే రూ. కోటి ఇస్తామని ఆఫర్ చేశారు.

హైదరాబాద్: హత్య కేసులో సాక్ష్యం చెప్పకుంటే భారీగా డబ్బు ఇస్తామని ఆఫర్ చేశారు. గమ్మున ఉండాలని, అలా ఉంటే రూ.కోటి ఇస్తామని చెప్పారు. వారికి జరిగిన అన్యాయం ముందు ఆ డబ్బు చిన్నబోయింది. పోలీసుల అండగా ఉండటం కలిసి వచ్చింది. బాధితులు ధైర్యంగా ఉండి జడ్జి ముందు సాక్ష్యం చెప్పారు. హత్య చేసిన నిందితులకు న్యాయమూర్తి యావజ్జీవ శిక్ష ఖరారు చేశారు. ఈ ఘటన భువనగిరి జిల్లాలో జరిగింది.

ఏం జరిగిందంటే..?

భువనగిరి జిల్లా మోట కొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాదగిరి గౌడ్ కుటుంబం ఉంటుంది. పక్కన బుర్ర రాజేశ్ ఫ్యామిలీ నివసించేది. 2013 సంవత్సరంలో రాజేశ్ తల్లిదండ్రులు చనిపోయారు. 6 నెలల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. యాదగిరి గౌడ్ మంత్రాలు చేయడం వల్లే చనిపోయారని రాజేశ్ అనుమానించాడు. ఎలాగైనా సరే అతడిని హత్య చేయాలని ప్రణాళిక రచించాడు. 13 మందితో కలిసి యాదగిరి గౌడ్‌ను దారుణంగా హత్య చేశాడు. తర్వాత కేసు నమోదవడంతో విచారణ జరుగుతుంది.

ప్రలోభాల పర్వం

యాదగిరి గౌడ్ కేసును భువనగిరి జిల్లా అదనపు సెషన్స్ జడ్జి విచారించారు. కేసు విచారణ తుది దశకు చేరింది. సాక్ష్యం చెప్పొద్దని యాదగిరి కుమారులు, కోడళ్లను రాజేశ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిశారు. సాక్ష్యం చెప్పకుండా ఉంటే రూ.కోటి ఇస్తామని ప్రకటించారు. గ్రామంలో జరిగిన పంచాయతీలో విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ యాదగిరి కుమారులు, కోడళ్లు వినలేదు. రాజేశ్ అనుచరులతో కలిసి యాదగిరిని హత్య చేశారని సాక్ష్యం ఇచ్చారు. పోలీసులు పకడ్బందీగా ఆధారాలు సమర్పించారు. హత్య చేసిన ఆ 14 మందికి జడ్జి జీవిత ఖైదు విధించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 31 , 2024 | 02:32 PM

Advertising
Advertising