Tummala: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్ గార్డెన్: తుమ్మల
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:39 AM
రాష్ట్రంలో సొంతంగా సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, అందుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహకారం కూడా కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సొంతంగా సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, అందుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహకారం కూడా కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మలేషియా పర్యటనలో ఉన్న మంత్రి గురువారం ఎఫ్‌జీవీ కంపెనీ నిర్వహిస్తున్న సీడ్ గార్డెన్, నర్సరీలతో పాటు అధునాతన పద్ధతుల్లో నిర్వహిస్తున్న విత్తన కేంద్రాన్ని సందర్శించి, ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు.
ఇప్పటికే ఎఫ్‌జీవీ కంపెనీ నుంచి తెలంగాణకు సీడ్ లింగ్స్‌ను తెప్పించామని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని, అందుకు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కంపెనీ ప్రతినిధులు సీడ్‌గార్డెన్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
Updated Date - Oct 25 , 2024 | 03:39 AM