ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala : ఆయిల్‌పామ్‌ మిల్లుల స్థాపనలో వేగం పెంచండి

ABN, Publish Date - Sep 26 , 2024 | 03:54 AM

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ మిల్లుల స్థాపన పనులను వేగవంతం చేయాలని గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

  • గోద్రెజ్‌ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ మిల్లుల స్థాపన పనులను వేగవంతం చేయాలని గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సంవత్సరంలో కనీసం 15,000 ఎకరాలపైన ఆయిల్‌పామ్‌ సాగు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వం తరపున అవసరమైన మేర సహకారాన్ని అందిస్తామని వారికి హామీనిచ్చారు.


బుధవారం సచివాలయంలో గోద్రెజ్‌ గ్రూప్‌ అధ్యక్షుడు రాకేశ్‌ స్వామి, గోద్రెజ్‌ ఆగ్రో వెట్‌ లిమిటేడ్‌ ఎండీ బలరాం సింగ్‌ యాదవ్‌, ఆయిల్‌ఫామ్‌ సీఈవో శ్రీ సౌగత నియోగీ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్‌ మిల్లు నిర్మాణ పనులను వచ్చే నెల నుంచే ప్రారంభిస్తామని మంత్రికి కంపెనీ ప్రతినిఽధులు తెలిపారు. అనంతరం తమ కంపెనీ సాధించిన లక్ష్యాలు, ప్రగతిని వివరించారు.

Updated Date - Sep 26 , 2024 | 03:54 AM