Tummala: ఎన్టీఆర్‌తోనే తెలుగుజాతికి గుర్తింపు
ABN, Publish Date - Nov 25 , 2024 | 02:41 AM
ప్రపంచానికి తెలుగుజాతి కీర్తిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ద్వారానే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కృషి: తుమ్మల
ఖమ్మం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతిప్రతినిది): ప్రపంచానికి తెలుగుజాతి కీర్తిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ద్వారానే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో వెలుగుమట్ల అర్బన్ పార్కుకు రూ.2 కోట్లతో చేపట్టిన రహదారికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కమ్మ మహాజన సంఘం వనసమారాధనలో పాల్గొని మాట్లాడారు. కమ్మకులస్తులది స్వతహాగా వ్యవసాయం వృత్తి అయినా ప్రపంచీకరణ నేపథ్యంలో అన్నివృత్తుల్లో రాణించి ప్రతిభావంతులుగా నిలుస్తున్నారన్నారు. దేశ, విదేశాల్లో డాక్లర్లు, ఇంజనీర్లుగానే కాకుండా ఐటీ సంస్థలకు సీఈవోలుగా రాణిస్తుండడం తెలుగుజాతి అదృష్టమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటే తన లక్ష్యమని, ఇందుకోసం తనవంతు కృషిచేస్తాని తుమ్మల తెలిపారు.
Updated Date - Nov 25 , 2024 | 02:41 AM