Tummala: ధాన్యం సేకరణలో ఇబ్బందులు కలగొద్దు
ABN, Publish Date - Nov 14 , 2024 | 04:24 AM
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ధాన్యం సేకరణకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న పౌరసరఫరాలశాఖతో మార్కెటింగ్‌శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి తుమ్మల
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ధాన్యం సేకరణకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న పౌరసరఫరాలశాఖతో మార్కెటింగ్‌శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ ఉదయ్ కుమార్, ఆగ్రోస్ ఎండీ కావేటి రాములు, మార్కెటింగ్‌శాఖ అధికారులతో బుధవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా... ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా గోదాముల్లో నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం 29 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యం ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లకు అవసరమైన వస్త్రాల కోసం టెస్కోకు ఆర్డర్లు ఇవ్వాలని తుమ్మల సూచించారు. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన వస్త్రాల సరఫరాను త్వరగా పూర్తిచేయాలని ఔళిశాఖ అధికారులను ఆదేశించారు.
Updated Date - Nov 14 , 2024 | 04:24 AM