Tummala : గోదావరి వరద రాకుండా కరకట్ట విస్తరణ
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:35 AM
ఈ సారి గోదావరి వరద తుది ప్రమాద హెచ్చరికకు చేరువగా వచ్చినా ముందస్తు చర్యలతో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ముందస్తు చర్యలతో ముంపును అడ్డుకున్నాం: తుమ్మల
భద్రాచలం, సెప్టెంబరు 11: ఈ సారి గోదావరి వరద తుది ప్రమాద హెచ్చరికకు చేరువగా వచ్చినా ముందస్తు చర్యలతో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గోదావరి వరదల నేపఽథ్యంలో బుఽధవారం భద్రాచలంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వరద సహాయక చర్యలు, తదితర అంశాలపై మంత్రి తుమ్మల సమీక్షించారు.
భద్రాచలం వద్ద గోదావరి తుది ప్రమాద హెచ్చరిక దాటినా భద్రాచలం నుంచి వాజేడు వరకు రాకపోకలకు అంతరాయం లేకుండా అవసరమైన చోట రోడ్డు ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో గోదావరి వరద గండం లేకుండా శాశ్వత ప్రాతిపదికన కరకట్ట వద్ద స్లూయి్‌సల సామర ్థ్యం పెంచాలని సూచించారు.
Updated Date - Sep 12 , 2024 | 03:36 AM