Shamshabad: బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో పాములు
ABN, Publish Date - Nov 26 , 2024 | 04:48 AM
ఇద్దరు మహిళలు బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో విషపూరిత పాములను తీసుకొస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల అదుపులో ఇద్దరు మహిళలు
శంషాబాద్ రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు మహిళలు బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో విషపూరిత పాములను తీసుకొస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కారు. సోమవారం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు అనుమానస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వారి బ్యాగులను స్కాన్ చేశారు. ఆ బ్యాగుల్లో రెండు పాములు ఉన్నట్లు గుర్తించి ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
పాములను ఎందుకు తీసుకొచ్చారు..? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? బ్యాంకాక్ విమానాశ్రయంలో భద్రతాధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించలేదు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాముల స్మగ్లింగ్‌పై పలు అనుమానాలున్నాయని అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన పాములను జూపార్క్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Updated Date - Nov 26 , 2024 | 04:48 AM