ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Minister: పేదరికం లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి..

ABN, Publish Date - Aug 14 , 2024 | 12:05 PM

‘పేదరికం లేని గ్రామాలు ఉండాలన్నదే నా కల’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(Minister Shivraj Singh Chauhan) అన్నారు.

- కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

హైదరాబాద్: ‘పేదరికం లేని గ్రామాలు ఉండాలన్నదే నా కల’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(Minister Shivraj Singh Chauhan) అన్నారు. రాజేంద్రనగర్‌లో గల జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ సంస్థ(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో మంగళవారం జరిగిన 66వ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేశ్‌ పాశ్వాన్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌ పెమ్మసాని, కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార ప్రసారశాఖ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌ పెమ్మసానితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.

ఇదికూడా చదవండి: Ranganath: కాలువ జోలికొస్తే ఎఫ్‌ఐఆర్‌..


కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు థింక్‌ ట్యాంక్‌గా పనిచేస్తున్న రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ శాఖను శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అభినందించారు. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో మరిన్ని శిక్షణా కార్యక్రమాలను పెంపొందించడానికి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో పీజీ డిప్లొమా(PG Diploma) చేస్తున్న విద్యార్థులు గ్రామ సీమల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో చదువుతున్న పీజీ విద్యార్థులు పీహెచ్‌డీ చేయడం కోసం న్యూఢిల్లీలోని జేఎన్‌యూతో రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.


ఈ అవగాహన ఒప్పందం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన అధికారుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గ్రామ్‌ రోజ్‌గార్‌ సేవక్‌ అనే ఆన్‌లైన్‌ కోర్సును కూడా ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ క్యాంప్‌సలో ఉన్న రూరల్‌ టెక్నాలజీ పార్కును సందర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రౌండ్‌ మోడల్‌ హౌజ్‌ (డబుల్‌ బెడ్‌రూమ్‌)ను ఆయన ప్రారంభించారు. 409.5 చదరపు అడుగులలో నిర్మించిన ఇంటికి రూ.4.04 లక్షలు ఖర్చయిందని అధికారులు మంత్రికి వివరించారు. చదరపు అడుగుకు రూ.987 ఖర్చు అవుతుందన్నారు.


ఈ సందర్భంగా మంత్రితో పాటు ఇతర ప్రముఖులు ఆర్‌టీపీ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలే్‌షకుమార్‌ సింగ్‌, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జి.నరేంద్రకుమార్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శులు తనూజ ఠాకూర్‌ ఖల్జో, కరాలిన్‌ ఖోంగ్వార్‌ దేశ్‌ముఖ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రొఫెసర్‌ మాపూర్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2024 | 12:05 PM

Advertising
Advertising
<