Sangareddy: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
ABN, Publish Date - Nov 24 , 2024 | 04:21 AM
ఇంట్లో ఉన్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్‌లో జరిగింది.
పూర్తిగా కాలిపోయిన బాధితురాలి ముఖం
కల్హేర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఉన్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్‌లో జరిగింది. స్నేహలత(19) అనే యువతి.. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా శుక్రవారం ఒక్కతే ఇంట్లో ఉంది. ముఖానికి ముసుగు ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఇంట్లో చొరబడి యువతి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న ఆమె కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు.
వెళ్తూ ఇంటి తలుపులకు గడియపెట్టాడు. బాధితురాలి అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తీయగా, అప్పటికే యువతి ముఖం పూర్తిగా కాలిపోయి ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను నారాయణఖేడ్ ఆ స్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Nov 24 , 2024 | 04:21 AM