ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam: లెండి ప్రాజెక్టు నిర్మాణ అడ్డంకులను తొలగిస్తాం

ABN, Publish Date - Nov 16 , 2024 | 03:52 AM

మహారాష్ట్ర ఎన్నికల తర్వాత లెండి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోతామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని తెలిపారు.

  • త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం

  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌ ప్రకటన

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ఎన్నికల తర్వాత లెండి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోతామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని తెలిపారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కలిసి మరాఠ్వాడా ప్రాంతంలోని ముఖేద్‌ నియోకవర్గంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడి ప్రజలకు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లెండి ప్రాజెక్టుతో ఇరు రాష్ట్రాల ప్రజలకూ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలనే మలుపు తిప్పనున్నాయని, ఈ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ 200పై చిలుకు స్థానాల్లో గెలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 16 , 2024 | 03:52 AM