ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లలో పొరపాట్లు జరగొద్దు

ABN, Publish Date - Nov 03 , 2024 | 04:15 AM

ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంకగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకురావొద్దని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సూచించారు.

  • కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంకగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకురావొద్దని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సూచించారు. మొదటిసారిగా సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోన్‌సను అందిస్తుందని, ఇది చరిత్రాత్మక నిర్ణయమని అభివర్ణించారు. ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై శనివారం మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో దేశానికి తలమానికంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ సీజన్‌లో 150 లక్షల టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని, ఇందుకోసం రూ.30వేల కోట్లు అవసరమవుతాయన్నారు.


ఇప్పటికే రూ.20వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, అదనపు నిధులు అవసరమైనా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం ప్రభుత్వానికి చేరగానే మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీ రిలీజ్‌ చేస్తామన్నారు. కొనుగోళ్ల కోసం 7,572 కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించగా.. ఇప్పటికే 4,598 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వివరించారు.

Updated Date - Nov 03 , 2024 | 04:15 AM