Uttam: సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ పొందండి
ABN, Publish Date - Nov 10 , 2024 | 02:25 AM
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీ్‌సగఢ్ నుంచి నిరభ్యంతర పత్రం పొందడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
మూసీ గరిష్ఠ వరదపై పునఃపరిశీలన: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్,నవంబరు9(ఆంధ్రజ్యోతి): సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీ్‌సగఢ్ నుంచి నిరభ్యంతర పత్రం పొందడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మక్కసాగర్‌లో ముంపు ప్రభావిత ఛత్తీ్‌సగఢ్ రైతులకు పరిహారంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించి, సమస్యను పరిష్కరించాలని సూచించారు. మూసీ గరిష్ఠ వరదపై హైడ్రాలజీ నివేదికను ఐఐటీ-హైదరాబాద్ నిపుణులతో పునఃపరిశీలన చేయిస్తున్నామని అధికారులు గుర్తు చేశారు.
కాగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ నుంచి ఏదుల దాకా ప్రధాన కాలువ సవరణ అంచనాలను ఆమోదించాలని మంత్రి నిర్దేశించారు. ప్రాజెక్టుల్లో పూడికతీతను ప్రయోగాత్మకంగా కడెం ప్రాజెక్టులో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. మొడికుంటవాగు సవరణ అంచనాలను ఆమోదించారా అని మంత్రి అడగ్గా ఇటీవలే స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీలో ఆమోదించి, అనుమతుల కోసం ప్రభుత్వానికి ఫైలు పంపించనున్నట్లు అధికారులు గుర్తు చేశారు.
Updated Date - Nov 10 , 2024 | 02:25 AM