Uttam Kumar Reddy: 2026 డిసెంబరుకల్లా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయాలి
ABN, Publish Date - Oct 17 , 2024 | 03:20 AM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులను 2026 డిసెంబరుకల్లా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆ సొరంగంతో ఏటా రూ.200 కోట్ల కరెంట్ బిల్లు ఆదా.. బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన చెక్‌డ్యామ్‌లపై విచారణ
అదో కుంభకోణం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులను 2026 డిసెంబరుకల్లా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంతో రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు గ్రావిటీ ద్వారా అందుతుందని, దీనివల్ల ఏటా రూ.200 కోట్ల కరెంట్ బిల్లులు ఆదా అవుతాయని చెప్పారు. బుధవారం జలసౌధలో దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కోసం ఇటీవలే అంచనాలను సవరించి, రూ.4637 కోట్లతో ప్రాజెక్టును ఆమోదించామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని వేగంగా పూర్తిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. యి.
ఎస్‌ఎల్‌బీసీ హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులను రూ.440 కోట్లతో చేపడుతున్నామని, ఈ కాలువల ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 200 గ్రామాలకు తాగునీటి సౌకర్యం అందుతుందన్నారు. నక్కలగండి ప్రాజెక్టును వేగంగా పూర్తిచేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన చెక్‌డ్యామ్‌లు దెబ్బతిన్నాయని, నిర్మాణాల్లో లోపాలపై విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు. ఇదో పెద్ద కుంభకోణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిర్యాలగూడ, దేవరకొండలో ప్రాజెక్టులకు భూసేకరణను వేగిరం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులను తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మరమ్మతు చేయాలన్నారు. ఈ సందర్భంగా పొగిళ్ల, కంబాలపల్లి, అంబభవాని, ఏకేబీఆర్, పెద్దగట్టు, దున్నపోతులగండి, వీర్లపాలెం, జానంపాడు తదతర ఎత్తిపోతల పథకాలపై చర్చ జరిగింది. వీటికి తగిన డిజైన్లు ఖరారు చేయాలని మంత్రి ఆదేశించారు.
బునియాదిగాని కాలువకు రూ.266 కోట్లు
మూసీ ప్రాజెక్టు పరిధిలోని బునియాదిగాని కాలువ పునరుద్ధరణ పనులకు రూ.266.65 కోట్లతో పాలనాపరమైన అనుమతి లభించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా బుధవారం జీవో జారీ చేశారు. యాదాద్రి జిల్లాలో మూసీ ప్రాజెక్టు కింద బునియాదిగాని కాలువతోపాటు పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువలు ఉన్నా
Updated Date - Oct 17 , 2024 | 03:20 AM