ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vemulawada: రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం.. ఎప్పటినుంచి అంటే..?

ABN, Publish Date - Aug 05 , 2024 | 07:48 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. ఇక్కడ శివుడు.. రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ పరమశివుడిని దర్శించుకొని తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (YTADA) కీలక నిర్ణయం తీసుకుంది.

Vemulawada Temple

వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. ఇక్కడ శివుడు.. రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ పరమశివుడిని దర్శించుకొని తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (YTADA) కీలక నిర్ణయం తీసుకుంది.


తిరుమల మాదిరిగా..

తిరుమలలో భక్తుల కోసం స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.300 తీసుకొని, స్పెషల్ దర్శన టికెట్ ఇస్తారు. టీటీడీ యాప్, ఆన్ లైన్‌లో మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. వేములవాడలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే వీటీఏడీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్రేక్ దర్శన టికెట్ అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిపాదనలను దేవదాయశాఖ కమిషనర్‌కు పంపించారు. ఆమోదం తెలుపడంతో ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యింది.


ఉదయం, సాయంత్రం

బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం 10.15 గంటల నుంచి 11.15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శన సమయం అని వైటీడీఏ పాలకవర్గం ప్రకటించింది. ప్రతి రోజు 300 వందల మంది నుంచి 500 మంది వరకు బ్రేక్ దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. బ్రేక్ దర్శనం కోసం ఒక్కొక్కరికి రూ.300 టికెట్ తీసుకొని, ఆ టికెట్‌పై లడ్డూ ఉచితంగా అందజేస్తారు.


తగ్గనున్న రద్దీ

బ్రేక్ దర్శనం కోసం టైమ్ కేటాయించడంతో ఆ సమయంలో భక్తులు దర్శించుకునే వీలు ఉంది. మిగతా భక్తుల రద్దీ కూడా తగ్గుతుందని పాలకమండలి అంచనా వేసింది. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఆ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనం ప్రవేశ పెట్టారు.

Updated Date - Aug 05 , 2024 | 07:48 AM

Advertising
Advertising
<