ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma: ఏడో రోజు వేపకాయ బతుకమ్మ.. ఈరోజు ఏం చేస్తారంటే

ABN, Publish Date - Oct 08 , 2024 | 09:46 AM

Telangana: సకినాలకు ఉపయోగించి పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాకుండా బెల్లం, పప్పును కూడా నైవేద్యంగా పెడతారు. చామంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు వరుసలతో త్రికోణంలో తయారు చేస్తారు.

Vepakaya Bathukamma

తెలంగాణలో బతుకమ్మ (Bathukamma) వేడుకలు ఏడో రోజుకు వచ్చేశాయి. ఊరూవాడలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. చిన్నా, పెద్దా తేడాలేకుండా బతుకమ్మ ఉత్సవాల్లో మునిగితేలుతున్నారు తెలంగాణ ఆడపడుచులు. ఉదయాన్నే లేచి ఇళ్లు, వాకిలి శుభ్రం చేసుకుని పూజ చేస్తారు. ఆపై బతుకమ్మకు కావల్సిన పూలను సిద్ధం చేసుకుంటారు. ఇక సాయంత్రం అవుతుండగా బతుకమ్మను ఎంతో శ్రద్ధగా ఆకర్షణీయంగా ఉండేలా పేర్చుతారు. తీరొక్క పువ్వుతో బతుకమ్మ పేర్చుతూ సంతోషిస్తుంటారు మహిళలు. బతుకమ్మ పాట పాడుతూ బతుకమ్మను పేరుస్తుంటారు కొందరు మహిళలు. మొదటి రోజు ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు మొదలవగా.. రెండో రోజు రెండు వరుసలతో, మూడవ రోజు మూడు వరుసలతో, నాలుగో రోజు నాలుగు వరుసలతో ఇలా ఒక్కో రోజు ఒక్కో విధంగా బతుకమ్మను పేర్చుతూ ఆడిపాడుతుంటారు. ఇక ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పేరు. ఈరోజు బతుకమ్మను పేర్చరు. అలాగే ఎలాంటి నైవేద్యం కూడా సమర్పించారు. నేడు ఏడోరోజు వేపకాయ బతుకమ్మను సిద్ధం చేస్తారు మహిళలు.

Elections: హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..


వేపకాయ బతుకమ్మ విశిష్టత...

ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (మంగళవారం) నాడు వేపకాయ బతుకమ్మను పేర్చుతారు. ఈరోజు బియ్యం పిండిని వేయించి, బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను గౌరమ్మకు నివేదిస్తారు. ఈ విధంగా చేస్తారు కాబట్టే ఈరోజు వేపకాయ బతుకమ్మ అనే పేరు వచ్చింది. చామంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు. వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తి అమ్మవారికి సాక్షాత్తూ ప్రతిరూపం. అలాంటి ఆదిపరాశక్తికి పూజిస్తూ వేపకాయల బతుకమ్మను మహిళలు ఆరాధిస్తారు. సకినాలు తయారు చేసే పిండితో నైవేద్యం సమర్పిస్తారు.


తెలంగాణ పిండివంటల్లో సకినాలు ఎంతటి ప్రత్యకమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సకినాలకు ఉపయోగించి పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాకుండా బెల్లం, పప్పును కూడా నైవేద్యంగా పెడతారు. చామంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు వరుసలతో త్రికోణంలో తయారు చేస్తారు. అనంతరం వాకిట్లో ముగ్గులు వేసి బతుకమ్మను అక్కడ ఉంచి... బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడి పాడతారు. అనంతరం దగ్గర్లోని చెరువుల్లో, నదుల వద్దకు వెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఆపై ఇంటికి వచ్చి తాము చేసిన నైవేద్యాన్ని పిల్లలకు పంచిపెడతారు. అలాగే మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

తమ్ముళ్లూ.. ఇది తగదు!


మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీ రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తిభావంలో మునిగితేలుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Viral: వింత ప్రతీకారం! భర్త చితాభస్మాన్ని తిన్న మహిళ!

Dussehra: దసరాకు 6,304 ప్రత్యేక బస్సులు..

Read Latest Devotiona News And Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2024 | 09:59 AM