ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madigadda Barrage: 2019లోనే బుంగలు

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:41 AM

మేడిగడ్డ బ్యారేజీలో 2019లో నీటిని నింపినప్పుడే బుంగలు ఏర్పడ్డాయని, ఏడో బ్లాకు కింద ఇసుక కొట్టుకుపోవడ మే దీనికి కారణమని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తేల్చి చెప్పింది.

  • కాంక్రీటు బ్లాకులు, ఆప్రాన్లూ దెబ్బతిన్నాయి

  • 3 ఏళ్లు రిపేర్లు లేక 7వ బ్లాకు కుంగింది

  • నిర్మాణ సంస్థ, మాజీ ఈఎన్సీ, 15 మంది అధికారులు బాధ్యులు.. చర్యలు తీసుకోండి

  • నీటి పారుదల శాఖకు విజిలెన్స్‌ తుది నివేదిక

  • అందుకే బ్యారేజీలో ఏడో బ్లాకు కుంగింది

  • ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని కూడా కాఫర్‌ డ్యామ్‌ను తొలగించలేదు

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీలో 2019లో నీటిని నింపినప్పుడే బుంగలు ఏర్పడ్డాయని, ఏడో బ్లాకు కింద ఇసుక కొట్టుకుపోవడ మే దీనికి కారణమని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తేల్చి చెప్పింది. బ్యారేజీని 2019 జూన్‌లో ప్రారంభించారని, అదే ఏడాది నవంబరులో వరదల తర్వాత బ్యారేజీ దెబ్బతిందని, బ్యారేజీ గేట్లు మూసివేసిన తర్వాత దిగువ భాగంలో కాంక్రీట్‌ బ్లాకులు, ఆప్రాన్లు దెబ్బతిన్నాయని, అయినా.. మూడేళ్లపాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ చేపట్టకపోవడంతో 2023 అక్టోబరులో బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిందని స్పష్టం చేసింది. మూడు బ్యారేజీల వైఫల్యాలకు 15 మంది వరకూ అధికారులు బాధ్యులని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.


నిర్దేశిత పద్ధతిలో బ్యారేజీ నిర్మాణ పనులు జరగలేదని, మేడిగడ్డలో కుంగిన బ్లాక్‌-7కి సంబంధించిన పియర్ల కింద ఉన్న పునాది (ర్యాఫ్ట్‌), ర్యాఫ్ట్‌ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్‌ పైల్స్‌ను కూడా క్రమ పద్ధతిలో నిర్మించలేదని తేల్చింది. పనులు పూర్తి కాకపోయినా పూర్తయినట్లు సర్టిఫికెట్లు జారీ చేశారని గుర్తు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తుది నివేదికను శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను కలిసి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి అందజేశారు. బ్యారేజీల నిర్మాణ పనులు పూర్తి కాకపోయునా 2019 సెప్టెంబరు 10న దాదాపు పూర్తైనటు ్ల(సబ్‌స్టాన్షియల్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌) జారీ చేశారని, పనులు పూర్తికాకున్నా పూర్తైనట్టు ధ్రువీకరిస్తూ 2021 మార్చి 15న మళ్లీ పనుల పూర్తి ధ్రువీకరణ పత్రం జారీ చేశారని, బ్యాంకు గ్యారంటీల విడుదలలోనూ నిబంధనలు పాటించలేదని నివేదికలో పేర్కొన్నారు.


ఇండియన్‌ స్టాండర్డ్‌ కోడ్‌ ప్రకారం ప్రతి వర్షాకాలం ముగిసిన తర్వాత డ్యామ్‌ ఆప్రాన్‌ ఏరియాలో ‘సౌండింగ్‌ అండ్‌ ప్రొబింగ్‌’ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, డ్యామ్‌ యజమాని (ఈఎన్‌సీ రామగుండం) చేపట్టలేదని, బ్యారేజీ నిర్మాణ సమయంలో షీట్‌ పైల్స్‌తో ఏర్పాటు చేసిన కాఫర్‌ డ్యామ్‌ను నిర్మాణం పూర్తైన తర్వాత కూడా తొలగించలేదని, ఆ అవశేషాల కారణంగా వరద ప్రవాహం సజావుగా జరగలేదని వివరించారు. కాఫర్‌ డ్యామ్‌ తొలగించడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తీసుకుని కూడా దానిని తొలగించలేదని, నిర్మాణ సంస్థతోపాటు రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, సంబంధిత ఎస్‌ఈ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌లే ఇందుకు కారణమంటూ తప్పుబట్టింది.

Updated Date - Oct 29 , 2024 | 03:41 AM