Warangal Health City: వరంగల్ హెల్త్ సిటీ.. అంచనాలు ఎలా పెరిగాయి..?
ABN, Publish Date - Sep 06 , 2024 | 03:34 AM
వరంగల్ హెల్త్ సిటీ అంచనాలు అమాంతం ఎలా పెరిగాయని విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. దీనిపై వివరాలు ేసకరించేందుకు విజిలెన్స్ బృందం గురువారం డీఎంఈ కార్యాలయానికి వెళ్లింది.
ఆస్పత్రిపై ఎన్ని మీటింగ్‌లు పెట్టారు
టెండర్లు సహా సమగ్ర వివరాలివ్వండి
డీఎంఈ ఆఫీ్‌సలో విజిలెన్స్ విచారణ
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వరంగల్ హెల్త్ సిటీ అంచనాలు అమాంతం ఎలా పెరిగాయని విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. దీనిపై వివరాలు ేసకరించేందుకు విజిలెన్స్ బృందం గురువారం డీఎంఈ కార్యాలయానికి వెళ్లింది. ‘‘హాస్పిటల్ ప్లాన్ ఎప్పుడు రూపొందించారు..? టెండర్లు ఎప్పుడు ఇచ్చారు..? అంచనా ఎలా పెరిగింది..? గతంలో హెల్త్ సిటీపై ఎన్ని మీటింగ్‌లు నిర్వహించారు..? మినిట్స్ కాపీలు ఉన్నాయా..?’’ వంటి ప్రశ్నలు వేసి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
మూడు నాలుగు రోజుల్లో మిగతా సమాచారాన్ని కూడా అందజేస్తామని అధికారులు విజిలెన్స్‌కు తెలిపారు. కాగా, విజిలెన్స్ అధికారులు అడిగిన వివరాల్లో కొన్ని అందజేశామని, మిగతావి సిద్ధం చేస్తున్నామని ఓ అధికారి తెలిపారు. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డీఎంఈగా పనిచేసిన డాక్టర్ రమేశ్ రెడ్డి కనుసన్నల్లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మొదలయ్యాయి.
ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టళ్లకు నేడు శంకుస్థాపన
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం నిర్మించనున్న రెండు కొత్త హాస్టల్ భవనాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా రెండు హాస్టల్ భవనాలను నిర్మించేందుకు రూ.115 కోట్లు, దంత వైద్య(డెంటల్) విద్యార్థుల హాస్టల్ భవన విస్తరణ కోసం రూ.6 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Updated Date - Sep 06 , 2024 | 03:34 AM