ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal: అంచనా వ్యయం ఎలా పెరిగింది?

ABN, Publish Date - Aug 31 , 2024 | 04:30 AM

వరంగల్‌ పాత సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం సందర్శించింది.

  • ‘వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి’పై విజిలెన్స్‌ ఆరా.. ఆస్పత్రిని సందర్శించిన అధికారుల బృందం

వరంగల్‌ మెడికల్‌, ఆగస్టు 30: వరంగల్‌ పాత సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం సందర్శించింది. ఆస్పత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని ఒకేసారి రూ.625.95 కోట్లు పెంచడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఇక్కడికి వచ్చారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ డీజీ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు వరంగల్‌ అధికారి బాలకోటి నేతృత్వంలోని బృందం ఆస్పత్రి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించింది.


భవన నిర్మాణ కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ ఇంజనీరింగ్‌ సిబ్బందితో వారు మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ శాఖ సూపరింటెండెంట్‌ కార్యాలయం నుంచి నిర్మాణానికి సంబంధించిన రికార్డులను తెప్పించుకొని పరిశీలించి.. వాటిలో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా.. తర్వాత దానిని రూ.1,725.95 కోట్లకు పెంచడం తెలిసిందే.


కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల వరంగల్‌ నగర పర్యటనలో భాగంగా ఈ ఆస్పత్రిని సందర్శించి.. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే అంచనా వ్యయాన్ని పెంచడమేంటని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో ఏదో మతలబు ఉందంటూ విచారణకు ఆదేశించారు. ఈ ఆస్పత్రితోపాటు రాష్ట్రంలోని మరో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అంచనా వ్యయం పెంపుపైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


  • రూ.2 వేల కోట్ల రుణం పైనా ఆరా

సీఎం ఆదేశాలతో తాజాగా ఆస్పత్రిని సందర్శించిన అధికారుల బృందం.. ఇప్పటివరకు జరిగిన పనుల ప్రగతిపై ఆరా తీసింది. భవన నిర్మాణ పనులపై ఇప్పటివరకు ఎంతవరకు ఖర్చు చేశారు? ఇంకా ఎంత ఖర్చు చేయాల్సి ఉంది? పనులు ఏ మేరకు జరిగాయి.? తొలుత ఆమోదించిన డిజైన్ల ప్రకారమే పనులు జరుగుతున్నాయా? వంటి వివరాలపై ఆరా తీశారు.


భవన నిర్మాణం జరుగుతున్న సెంట్రల్‌ జైలు స్థలాన్ని గత ప్రభుత్వం బ్యాంకులో తనఖా పెట్టి రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడంపైనా విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు రికార్డులను, ఇతర సంబంధిత పత్రాలను సేకరిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బాలకోటి తెలిపారు.

Updated Date - Aug 31 , 2024 | 04:30 AM

Advertising
Advertising